Tuesday, 24 March 2026
  • Home  
  • “క్యాన్సర్” ను జయించవచ్చు
- ఆంధ్రప్రదేశ్

“క్యాన్సర్” ను జయించవచ్చు

ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను జయించవచ్చని, తగు జాగ్రత్తలు పాటిస్తే జయించటం కష్టమేమి కాదని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా.పైడి.సింధూర అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా, స్థానిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని, కళాశాల డైరెక్టర్ బరాటం.శ్రీనివాస చక్రవర్తి, ప్రిన్సిపాల్ కె.శివ శంకర్ సహకారంతో నిర్వహించారు. ఇందులో భాగముగా ఆమె మాట్లాడుతూ శరీరంలో ఏ బాగంలోనైనా ఎదుగుతున్న గడ్డలు, కణుతులు, అసహజమైన రక్థస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకపోవడం వంటి లక్షణాలు ఉంటె, అశ్రద్ధ చెయ్యకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. తాజా కూరగాయలు, ఆకు కూరకు ఎక్కువగా తీసుకోవాలని, వీటిలో క్యాన్సర్ కారకాలతో పోరాడే యాంటిజెన్స్ ఉంటాయన్నారు. సర్వైకల్ క్యాన్సర్ వేక్సిన్ అందుబాటులో ఉందని, తొమ్మిది నుంచి పదహారు సంవత్సరాలు దాటిన వారు డోసులు వేసుకోవాలన్నారు. విశిష్ట అతిధులుగా పాల్గొన్న రవితేజ డెవలెపర్స్ అధినేత పి.సింహాచలం, జీఎన్ జ్యుయలర్స్ ఎండి కిరణ్ కుమార్, సంధ్య దంపతులు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ క్యాన్సర్ పై అవగాహన కల్పించిన లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ బృందానికి ధన్యవాదాలని, మీ పరిసర ప్రాంతాలలో గాని, మీ కుటుంబ సభ్యులలో గాని అనుమానాలుంటే సత్వరమే వైద్యులని సంప్రదించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం.రామ్ గోపాల్, మెంటార్ నటుకుల.మోహన్, ఉపాధ్యక్షులు ఉర్లం.శివతేజ, ఛైర్పర్సన్ పొడుగు.చరణ్, సభ్యులు రామం, తదితరులు పాల్గొన్నారు.

  • లయన్ డా. పైడి.సింధూర
  • కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ అవగాహన(శ్రీకాకుళం – నవంబర్ పున్నమి ప్రతినిధి)

ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను జయించవచ్చని, తగు జాగ్రత్తలు పాటిస్తే జయించటం కష్టమేమి కాదని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా.పైడి.సింధూర అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా, స్థానిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని, కళాశాల డైరెక్టర్ బరాటం.శ్రీనివాస చక్రవర్తి, ప్రిన్సిపాల్ కె.శివ శంకర్ సహకారంతో నిర్వహించారు. ఇందులో భాగముగా ఆమె మాట్లాడుతూ శరీరంలో ఏ బాగంలోనైనా ఎదుగుతున్న గడ్డలు, కణుతులు, అసహజమైన రక్థస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకపోవడం వంటి లక్షణాలు ఉంటె, అశ్రద్ధ చెయ్యకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. తాజా కూరగాయలు, ఆకు కూరకు ఎక్కువగా తీసుకోవాలని, వీటిలో క్యాన్సర్ కారకాలతో పోరాడే యాంటిజెన్స్ ఉంటాయన్నారు. సర్వైకల్ క్యాన్సర్ వేక్సిన్ అందుబాటులో ఉందని, తొమ్మిది నుంచి పదహారు సంవత్సరాలు దాటిన వారు డోసులు వేసుకోవాలన్నారు.

విశిష్ట అతిధులుగా పాల్గొన్న రవితేజ డెవలెపర్స్ అధినేత పి.సింహాచలం, జీఎన్ జ్యుయలర్స్ ఎండి కిరణ్ కుమార్, సంధ్య దంపతులు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ క్యాన్సర్ పై అవగాహన కల్పించిన లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ బృందానికి ధన్యవాదాలని, మీ పరిసర ప్రాంతాలలో గాని, మీ కుటుంబ సభ్యులలో గాని అనుమానాలుంటే సత్వరమే వైద్యులని సంప్రదించాలన్నారు.

ఈ అవగాహన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం.రామ్ గోపాల్, మెంటార్ నటుకుల.మోహన్, ఉపాధ్యక్షులు ఉర్లం.శివతేజ, ఛైర్పర్సన్ పొడుగు.చరణ్, సభ్యులు రామం, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.