నెల్లూరు ఆగస్టు 16 పున్నమి ప్రతినిధి ://
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కాకాణి పూజిత రెడ్డిని మూడవ డివిజన్ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ అక్కల రెడ్డి నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా ఆమె యొక్క స్వగృహంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేయడం మరియు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మూడవ డివిజన్ వైయస్ఆర్సీపీ ఇంచార్జ్ అక్కల రెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కాకాని పూజితమ్మ తండ్రిబాటలో పార్టీ కోసం కష్టపడి పనిచేసే గొప్ప ఆశయ సాధకురాలని అదేవిధంగా ఆమెకు మున్ముందు ఉన్నత పదవులు అధిరోహించాలని ఆమెకు తమ యొక్క సహాయ, సహకారాలు అన్నివేళలా ఉంటాయని తండ్రికి తగ్గ తనయురాలికి పార్టీ అధినేత ఇచ్చిన సముచిత స్థానాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ స్వాగతిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బొమ్మ వరం ఎంపీటీసీ కొండారెడ్డి, వైసీపీ నాయకులు దశరధరామిరెడ్డి,హరి, రామచంద్రారెడ్డి మరియు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


