*కాకాణికి కలలో కూడా సోమిరెడ్డే కనిపిస్తున్నాడు* పీఏసీఎస్ ఛైర్మన్ తలచీరు.మస్తాన్ బాబు
పొదలకూరు : మాజీమంత్రి కాకానికి కలలో కూడా సోమిరెడ్డి కనిపిస్తున్నాడని 2029 లోను ఓటమి తప్పదనే భయం ఆయనను వెంటాడుతుందని పొదలకూరు పిఎసిఎస్ చైర్మన్ తలచీరు. మస్తాన్ బాబు అన్నారు బుధవారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో టిడిపి నాయకులు బొద్దులూరు మల్లిఖార్జున్ నాయుడు, కోడూరు.పెంచల భాస్కర్ రెడ్డి, కలిచేటి.ప్రభాకర్ రెడ్డి,గంటా.మల్లిఖార్జున్ యాదవ్,అలుపూరు శీనివాసులు తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలచీర మస్తాన్ బాబు మాట్లాడుతూ కాకాణి కారుల్లో షికార్లు చేయడం కాదు..కాలనీల్లోకి వస్తే వైసీపీ నేతల ఘన కార్యాలు తెలిసేవన్నారు.పొదలకూరు మండలంలో రోడ్లు వేసినా, కాలువలు పనులు జరిగినా, సోమశిల నీళ్లు తెచ్చినా, ఎత్తిపోతల పథకం వచ్చినా, ఆస్పత్రులు కట్టినా సోమిరెడ్డి పుణ్యమేనన్నారు.పరామర్శల పేరుతో పర్యటించిన కాకాణి నావూరుపల్లి ఎస్టీలతో రోడ్డుపై మాట్లాడటం కాదుఅని,కారు దిగి కాలనీలోకి వెళ్లుంటే వైసీపీ నేతల ఘనకార్యం తెలిసేవన్నారు.2023లో 5 గిరిజనుల ఇళ్లకు సంబంధించిన బిల్లులు చేసుకుని ఈ రోజుకీ నిర్మాణం పూర్తి చేయలేదన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాక మేం వారి అక్రమాలను బయటపెడితే అప్పుడొచ్చి సున్నం పూశారన్నారు.సీఎస్ఆర్ నిధులతో అదనంగా ప్రతి ఇంటికి మంజూరైన రూ.15 వేలను కూడా గిరిజనులకు తెలియకుండా వైసీపీ నేతలే కొట్టేశారన్నారు.నావూరుపల్లిలో రూ.20 లక్షలతో డ్రైన్లు నిర్మిస్తే ఈ రోజు చుక్కనీరు ప్రవహించే పరిస్థితి లేదన్నారు.ఊళ్లలోకి వచ్చి తమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నోటికొచ్చినట్టు దూషించడం కాదు..ఆయన చేపట్టిన అభివృద్ధి పనులను చూసి కనువిప్పు కలిగించుకోవాలన్నారు.2024లో 18 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయిన తాను 2029లో మళ్లీ సోమిరెడ్డి చేతిలో 36 వేల ఓట్ల తేడాతో ఓడిపోతానని భయం కాకాణిని వెంటాడుతోందన్నారు.


