Monday, 8 December 2025
  • Home  
  • కాంట్రాక్టర్లకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వం: అరవ శ్రీధర్
- అన్నమయ్య

కాంట్రాక్టర్లకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వం: అరవ శ్రీధర్

రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన అన్నారు:“జగన్ పాలనలో కాంట్రాక్టర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అప్పటివరకు కాంట్రాక్టర్లు చేసిన పనుల బిల్లులను నిలిపివేయడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్ల హక్కుల కోసం పోరాడారు, కోర్టు వరకు వెళ్లారు. అయినప్పటికీ పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లకు నష్టం కలిగింది.కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల హామీ మేరకు కాంట్రాక్టర్లకు పెండింగ్ నిధులను విడుదల చేశారు. ఇది కాంట్రాక్టర్లకు ఊరట కలిగించిన చారిత్రక నిర్ణయం. మా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. కోడూరు అభివృద్ధి కోసం, ప్రతి కాంట్రాక్టర్‌కు న్యాయం జరగడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ – “చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ వల్లే మాకు న్యాయం జరిగింది. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల కావడం మా కుటుంబాలకు ఊరట కలిగించింది” అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు

రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన అన్నారు:“జగన్ పాలనలో కాంట్రాక్టర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అప్పటివరకు కాంట్రాక్టర్లు చేసిన పనుల బిల్లులను నిలిపివేయడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్ల హక్కుల కోసం పోరాడారు, కోర్టు వరకు వెళ్లారు. అయినప్పటికీ పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లకు నష్టం కలిగింది.కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల హామీ మేరకు కాంట్రాక్టర్లకు పెండింగ్ నిధులను విడుదల చేశారు. ఇది కాంట్రాక్టర్లకు ఊరట కలిగించిన చారిత్రక నిర్ణయం. మా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. కోడూరు అభివృద్ధి కోసం, ప్రతి కాంట్రాక్టర్‌కు న్యాయం జరగడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని పేర్కొన్నారు.
కాంట్రాక్టర్లు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ – “చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ వల్లే మాకు న్యాయం జరిగింది. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల కావడం మా కుటుంబాలకు ఊరట కలిగించింది” అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.