రంగారెడ్డి జిల్లా ( పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 23 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపులో ప్రతీ హస్తం పార్టీ నాయకుల పాత్ర ఉండాలని సికింద్రాబాద్ జిల్లా పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు.
మహేశ్వరం నియోజకవర్గంలో వివిధ శుభకార్యాలు, పెళ్లీలకు రాలేకపోతున్నాను మళ్లీ వ్యక్తిగతంగా మీ ఇంటికి వచ్చి కలుస్తాను. ఆహ్వానించిన వారందరికీ ధన్యవాదాలు అని కేఎల్ఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ భావిస్తుందని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులు, ఓటర్లు ఎన్నికల్లో పాల్గొని ఓటింగ్ శాతం పెంచాలని కిచ్చెన్న కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.బి ఆర్ ఎస్ హయాంలో బస్తీ ప్రజలను పట్టించుకోలేదన్నారు.
బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి పేదవాడు కొనే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న గులాబోని గూబ గుయ్యుమనేలా ప్రజాతీర్పు ఇవ్వాలని ఓటర్లకు కేఎల్ఆర్ విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ హయాంలోనే బస్తీల అభివృద్ధి: కె ఎల్ ఆర్*
రంగారెడ్డి జిల్లా ( పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 23 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపులో ప్రతీ హస్తం పార్టీ నాయకుల పాత్ర ఉండాలని సికింద్రాబాద్ జిల్లా పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు. మహేశ్వరం నియోజకవర్గంలో వివిధ శుభకార్యాలు, పెళ్లీలకు రాలేకపోతున్నాను మళ్లీ వ్యక్తిగతంగా మీ ఇంటికి వచ్చి కలుస్తాను. ఆహ్వానించిన వారందరికీ ధన్యవాదాలు అని కేఎల్ఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ భావిస్తుందని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులు, ఓటర్లు ఎన్నికల్లో పాల్గొని ఓటింగ్ శాతం పెంచాలని కిచ్చెన్న కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.బి ఆర్ ఎస్ హయాంలో బస్తీ ప్రజలను పట్టించుకోలేదన్నారు. బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి పేదవాడు కొనే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న గులాబోని గూబ గుయ్యుమనేలా ప్రజాతీర్పు ఇవ్వాలని ఓటర్లకు కేఎల్ఆర్ విజ్ఞప్తి చేశారు.

