Thursday, 5 February 2026
  • Home  
  • కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు కరువైంది: నా రెడ్డి మోహన్ రెడ్డి ఆవేదన
- కామారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు కరువైంది: నా రెడ్డి మోహన్ రెడ్డి ఆవేదన

కామారెడ్డి, 13 అక్టోబర్. పున్నమి ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నిజమైన కార్యక ర్తలను, నాయకులను గుర్తించడం లేదని, వారికి న్యాయం జరగడం లేదని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాడు డిసిసి అధ్యక్షుని ఎంపిక కోసం డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాస్ అధ్యక్షతన, ఏఐసీసీ పరిశీలకులు రాజపాల్ కరోల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ సమావే శంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి…… ఎమ్మెల్యేలు పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను గౌరవించడం లేదని, వారిని లెక్కచేయడం లేదని మోహన్ రెడ్డి విమర్శించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మాత్రమే గుర్తింపు, పదవులు కేటాయించబడుతున్నాయని, దీనివల్ల కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న పాత నాయకులు, కార్యకర్తలు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. విశ్వా సం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యకర్తల శ్రమను గుర్తించాలి….. ఒక్క ఎమ్మెల్యేతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని మోహన్ రెడ్డి గట్టిగా గుర్తుచేశారు. పార్టీ అధికారంలోకి రావడానికి వెనుక కాంగ్రెస్ కార్యక ర్తలు, నాయకుల శ్రమ ఎంతో ఉందని అన్నారు. ఆ శ్రమను గుర్తించాలని డిమాండ్ చేశారు. నిజమైన కాంగ్రెస్ శ్రేణులను కాపాడుకుంటేనే భవిష్యత్తులో పార్టీకి మంచి రోజులు ఉంటాయని, గుర్తింపు వస్తుందని సూచించారు. “విభజించి పాలించే” నాయకులపై చర్యలు తీసుకోవాలి… అంతేకాక, పార్టీలో “విభజించి పాలించే” నాయకు లను గుర్తించి, వారిపై తక్షణమే చర్యలు తీసుకో వాలని మోహన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ లో ఈ విధమైన అసంతృప్తి పార్టీ బలోపేతంపై ఏ విధమైన ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్ తో పాటు జిల్లాలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామారెడ్డి, 13 అక్టోబర్. పున్నమి ప్రతినిధి :

కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నిజమైన కార్యక ర్తలను, నాయకులను గుర్తించడం లేదని, వారికి న్యాయం జరగడం లేదని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాడు డిసిసి అధ్యక్షుని ఎంపిక కోసం డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాస్ అధ్యక్షతన, ఏఐసీసీ పరిశీలకులు రాజపాల్ కరోల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ సమావే శంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.

ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి……

ఎమ్మెల్యేలు పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను గౌరవించడం లేదని, వారిని లెక్కచేయడం లేదని మోహన్ రెడ్డి విమర్శించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మాత్రమే గుర్తింపు, పదవులు కేటాయించబడుతున్నాయని, దీనివల్ల కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న పాత నాయకులు, కార్యకర్తలు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. విశ్వా సం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

కార్యకర్తల శ్రమను గుర్తించాలి…..

ఒక్క ఎమ్మెల్యేతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని మోహన్ రెడ్డి గట్టిగా గుర్తుచేశారు. పార్టీ అధికారంలోకి రావడానికి వెనుక కాంగ్రెస్ కార్యక ర్తలు, నాయకుల శ్రమ ఎంతో ఉందని అన్నారు. ఆ శ్రమను గుర్తించాలని డిమాండ్ చేశారు. నిజమైన కాంగ్రెస్ శ్రేణులను కాపాడుకుంటేనే భవిష్యత్తులో పార్టీకి మంచి రోజులు ఉంటాయని, గుర్తింపు వస్తుందని సూచించారు.

“విభజించి పాలించే” నాయకులపై చర్యలు తీసుకోవాలి…

అంతేకాక, పార్టీలో “విభజించి పాలించే” నాయకు లను గుర్తించి, వారిపై తక్షణమే చర్యలు తీసుకో వాలని మోహన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ లో ఈ విధమైన అసంతృప్తి పార్టీ బలోపేతంపై ఏ విధమైన ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్ తో పాటు జిల్లాలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.