ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
രാജന്ന സിരിസില്ല

కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డిపేట సర్పంచ్ మరియు ఉప సర్పంచ్

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డిపేట సర్పంచ్ మరియు ఉప సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా/పున్నమి ప్రతినిధి /జనవరి 20 గంభరావుపేట్ మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన సర్పంచ్ మహేష్ యాదవ్ గారు, ఉప సర్పంచ్ బాబు గారు సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామ స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. మల్లారెడ్డిపేట గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం సర్పంచ్ మహేష్ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రజల ఆశయాలు, గ్రామ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, గ్రామ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు శ్రమిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డిపేట సర్పంచ్ మరియు ఉప సర్పంచ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *