నెల్లూరు, 26.04.2020, (పున్నమి ప్రతినిధి, సి.ఎస్.రావు) “కష్టకాలంలో అండగా ఉంటాం అంటున్న ఉద్యోగ సంఘాలు ” ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాయకులు, అధికారులు ,ఉద్యోగులు సచివాలయ ఉద్యోగుల సహకారంతో నిర్వహిస్తున్న ఈసేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు డైరెక్టర్ తమ్మినేని .పాండు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గీతా మయి వృద్ధుల ఆశ్రమం ,బాలాజీ నగర్ నెల్లూరు నందు 100 మంది చిన్నారులకు ,వృద్ధులకు అన్నదానం నిర్వహించడంతోపాటు, మాస్కులు, బిస్కెట్స్ చేయడం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి చేజర్ల సుధాకర్ రావు ఏపీ జి ఈ ఏ జిల్లా నాయకులు మాట్లాడుతూ కరోనా కోవిద్ 19 లాక్ డౌన్ సందర్భంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయి సాధారణ జనం ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు ,ఉద్యోగుల సమన్వయంతో ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ,ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజు గీతామయి వృద్ధులు- చిన్నారుల ఆశ్రమంలో అన్నదానం, మాస్క్ లు పంపిణీ ,బిస్కెట్స్ అందజేసేందుకు శ్రీ పోలుపోగు. నరసింహారావు ,సూపరిండెంట్, పే మరియు అకౌంట్స్ ఆఫీస్, వర్క్స్ అకౌంట్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఒంగోలు వారు ముందుకు వచ్చి తమవంతు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నెల్లూరు జిల్లా శాఖ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు, ఆకలితో అలమటిస్తూ చెప్పుకోలేని దుస్థితి, దీన స్థితిలో అనేక మంది ఉన్నారని వారందరినీ కొంతమేరకు ఆదుకునేందుకు ఆకలి తీర్చేందుకు, అధికారులు ఉద్యోగులు తరలి ముందుకు రావాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు ఏనుగు రమణారెడ్డి ,పులి సతీష్, లక్ష్మీనారాయణ, , ఏవి. సురేష్ , చేజర్ల.తేజ విఆర్ఓ,రంజిత్, నాగరాజు, ఎస్ వి సుబ్బారెడ్డి, కిరణ్, సుధాకర్ రెడ్డి ,ఎపిజి ఈ ఏ మహిళా విభాగం జిల్లా చైర్మన్ టి. సౌందర్య జిల్లా కన్వీనర్ జిఎస్ఎల్. సౌజన్య కో చైర్మన్ ఆర్. ఇందిర, వైస్ చైర్మన్ సునీత తదితరులు పాల్గొన్నారు.