నిర్మల్ జిల్లా , సెప్టెంబర్, (పున్నమి ప్రతినిధి)
అంతర్జాతీయ సాహితీ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ మరియు జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణ్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన సాహితీ కిరీటి
పురస్కారానికి శ్రీ హంస వాహిని సాహిత్య కళా పీఠం అధ్యక్షులు కవి ,రచయిత జాధవ్ పుండలికి రావు పాటిల్ ఎంపికచేసి ఆహ్వాన పత్రం పంపారు. ఈనెల 28వ తేదీన హైదరాబాదులోని బిర్లా ఆడిటోరియంలో నిర్వహించే తెలుగు సాహితీ పట్టాభిషేకం మహోత్సవంలో ఈ అవార్డు అందజేయనున్నారు. అవార్డుకు ఎన్నికైన జేపి రావుకు కవులు కడారీ దశరథ్, కొండూరి పోతన్న, బసవరాజు, నరసయ్య, జాగిరి యాదగిరి అభినందనలు తెలిపారు.


