కళ తప్పిన వెంగమాంబ తిరునాళ్ళు
కరోనా దెబ్బతో వెలవెలబోతున్న నర్రవాడ
(నెల్లూరు – పున్నమి ప్రతినిధి)
. ఈ పేరు చెప్తేనే దేశవ్యాప్తంగా నెల్లూరు, జిల్లా నుంచి వెళ్లిన వలస వాసులు పులకించిపోతారు. ఉపాధి ఉద్యోగాల కోసం బతుకుదెరువు కోసం ఇక్కడి మెట్ట ప్రాంతం నుంచి ఎక్కడికి ఎక్కడికి వెళ్లిన వారందరూ ఒక్కసారిగా వచ్చి పల్లెల్లో వాలిపోతారు… అప్పటివరకు వెలవెలబోయిన పల్లెలు జనంతో కళకళలాడుతాయి.అప్పటివరకు ఇంటికొకరుగా బిక్కుబిక్కుమంటూ ఉన్న మెట్టప్రాంతంలో ఒక్కసారిగా ఆనందం గెంతులేస్తుంది… ఆ ప్యాయతలు.. అనురాగాలు పచ్చటి పందిళ్లు వేస్తాయి..గడపగడపా పసుపు పారాణి తో కళకళలాడుతాయి. ఇక తిరునాళ్ళలో అందచందాలు వర్ణనాతీతం. కోలాటాలు… కులుకు భజనలు..కౌమారుగైపోయాయన్న.. భోగాతాలు …డ్రామాలు..హరికథలు.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు… పండరి భజనలు.. ఆధునిక సినిమా గీతాల హాస్యవల్లరి లు ఆనందాన్ని పంచుతాయి..డీ జేల దారువులతో దద్దరిల్లే రికార్డ్ డాన్స్ లు కొత్త ఉత్సాహాన్నిస్థాయి…ఆపక్కనే డైమండ్ డబ్బాలు..జేబులు ఖాళీ చేస్తాయి.ఒకటేమిటి… అడుగడుగునా ఎగ్జిబిషన్లు… ఆకాశాన్ని తాకే జెయింట్ వీల్స్ విహరింపులు… ఇంద్ర మహేంద్రజాల తో మైమరిపించే ఆధునిక మాంత్రికుల ఆశ్చర్య విన్యాసాలు.. ఇలా ఒక్కటేమిటి గ్రామీణ ప్రాంతాల్లో పాత.. కొత్త తరం సంస్కృతి సంప్రదాయాలు… ఆచార వ్యవహారాలకు అదో వేదికంటే అతిశయోక్తి కాదు.. ప్రత్యేకించి నాటి నేటి తరం జానపద సౌరభాలు అక్కడ సాక్షాత్కరిస్తాయి.. ఇంకా చెప్పాలంటే మెట్ట ప్రాంతానికి సంక్రాంతి మాటేమో కానీ వెంగమాంబ తిరునాళ్ళు పేరు చెబితే ఊరూరా సంబరాలు సంతరించుకుంటాయి..బందుగణం తో నిండిపోతాయి. ఎక్కడెక్కడి నుంచో వలస పక్షుల్లా వాలిపోతారు.కొన్ని యువజంటలు అక్కడ ఒక్కటౌతాయి.. మరికొందరు ప్రేమికులు చకోరిపక్షుల్లా అక్కడి తిరునాళ్ళలో విహరిస్తారు.. ఆపై అమ్మవారిపై గుండెల్లో నిండిన భక్తి భావాలతో వెంగమాంబ గురవయ్య చౌదరి ల పూజలతో పులకించిపోతారు. లక్షల కొద్దీ జనం అక్కడ ఆలయానికి చేరి… అమ్మా.. మేమంతా.. లక్షణంగా ఉండాలంటూ పూజలు చేస్తారు.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క-సారక్క తిరణాల తరువాత అత్యంత వైభవంగా… అంతకుమించిన జన సందోహంతో నిండే గ్రామీణ జనజాతర పండుగ ఏదైనా ఉంది అంటే అది శ్రీ వెంగమాంబ తిరునాళ్ళలో మాత్రమేనని చెప్పకతప్పదు… వారం రోజుల పాటు జరిగే వెంగమాంబ తిరుణాల కోసం వేలాది మంది అక్కడ వ్యాపారాల కోసం వాలిపోతారు.. మూడు నెలలు ముందుగానే దుకాణాల వేలాది రూపాయల తో వేలంలో దక్కించుకుంటారు. లక్షలాదిగా వచ్చిన అమ్మవారి భక్తజనంతో కొద్దిపాటి వ్యాపారాలు చేసి పెట్టుబడి తో పాటు కొద్దిపాటి లాభాలు పొంది తిరుగు ప్రయాణం అవుతారు.. ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని లక్షల మంది తో నరవాడ కిక్కిరిసి పోతుంది.. ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతుంది. వారం రోజుల్లో ప్రధానమైన కళ్యాణం కొండ తిరుగుడు అమ్మవారి పూజా కార్యక్రమాల మూడు రోజులు జనం రద్దీని నియంత్రించేందుకు వేలాది మంది పోలీసులు.. అంతకుమించిన నిఘా కెమెరాలు పహారాతో… అధికారుల పర్యవేక్షణతో.. మధ్యమధ్యన రాజకీయ నాయకులు.. ప్రజాప్రతినిధుల హడావుడితో సాగే సందడి.. అంతా.. ఇంతా కాదు…కట్ చేస్తే…
ఇదంతా గతం…గా.. మారిపోయింది…మెట్ట పండుగ చరిత్రలో కలిసిపోయింది…జనసంబరాలు.ఆనందాలు ఆవిరయ్యాయి…తిరునాళ్ళ కళమారిపోయింది. వెంగమాంబ తిరునాళ్లు అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు… ఏపీ నుంచి గాక తెలుగు రాష్ట్రం తెలంగాణ పక్క రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు సహా అనేక ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపే రాష్ట్రాలు సైతం ఈసారి మౌన ముద్రలో ఉండిపోయాయి. తిరునాళ్ల సందర్భంగా వచ్చిన వలస వాసులతో కలకలలాడే మల్లెలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. అన్నింటికీ కారణం ఒక్కటే అదే… ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.
ఈ శతాబ్దంలోనే తొలిసారిగా అమ్మవారి ఆలయం లో భక్తి భజన కళ తప్పింది. తిరునాళ్ళు అన్న పేరే గాని నరవాడ మొత్తం వెలవెలబోతోంది. బస్సుల సందడి లేదు. ఇతర వాహనాల రద్దీ అసలే లేదు… అంతా నిర్మానుష్యం రాజ్యమేలుతున్న అన్నట్లుగా మారిపోయింది అమ్మవారి ఆలయ ప్రాంగణం నర్రవాడ.. మెట్ట వాసుల ఆరాధ్యదేవత శ్రీ వేంగమాంబ ఆలయ ప్రాంగణం తిరునాళ్ళలో కళ్యాణ అనంతరం జరిగే బండలాగుడు కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే బసవన్నల బారులు కనిపించలేదు..ఆబోతు ఎద్దుల అందచందాలు కనుమారుగయ్యాయి.. తిరునాళ్ల అనంతరం గుడి చుట్టూ తిరిగే బండ్లు తిరుగుళ్ళు మచ్చుకైనా లేవు.. కళ్యాణానికి కిక్కిరిసి పోయి జనం కనుచూపు మేర కానరాలేదు.. అమ్మవారి స్వగ్రామం వడ్డీ పాలెం లో పసుపు దంపకాల..దరువు లేవు..వాటికోసం పోటీపడే ఆడపడుచుల హడావుడి లేదు.. తిరునాళ్ళ వచ్చిందంటే పసుపు వర్ణాల రంగవల్లులతో నిండే గడపలు..పల్లె లోగిళ్లు మారి పోయాయి.. రంగవల్లులతో అలరించే అమ్మవారి పుట్టింటి వద్ద సాంప్రదాయ ఆనవాళ్లు అస్సలు కనిపించడం లేదు.
గ్రామీణ పల్లె భారతాన్ని సాక్షాత్కరించే మెట్ట తిరునాళ్ళు ఇప్పుడు మూగబోయాయి..కరోనా తో మొత్తం వలసవాసుల విడిది.. ఏడాదికోసారి..అక్కడి ఆప్యాయతలు.. అనురాగాల కలయికలను ఎగరేసుకుపోయింది ఈ దుష్ట మహమ్మారి…అంటూ అనేక మంది అమ్మవారి భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఏడాదికోసారి వచ్చే కి తిరునాళ్లతో ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లి ఇక్కడ కలిసి తమను ఇప్పుడు కరోనా విడదీసిందని కొందరు ఆ మహమ్మారిని తిట్టిపోస్తున్నారు.