కళ్లెం నవజీవన్ రెడ్డి ని పద్మావతి కాలనీవాసులు ఘనంగా సన్మానం
కార్పొరేటర్‌గా 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి ని పద్మావతి కాలనీవాసులు ఘనంగా సన్మానించారు
పున్నమి న్యూస్ ప్రతినిధి
10 ఫిబ్రవరి 2026
హయత్‌నగర్ డివిజన్
హయత్‌నగర్ డివిజన్ అభివృద్ధి కోసం గత ఐదు సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తూ, కాలనీలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజ్, మౌలిక వసతులు మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు కృతజ్ఞతగా కాలనీ ప్రజలు ఈ సత్కారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ, పద్మావతి కాలనీ ప్రజల ప్రేమాభిమానాలు తనకు మరింత సేవ చేయాలనే ప్రేరణనిస్తాయని, భవిష్యత్తులో కూడా కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, కాలనీ అధ్యక్షులు అమర్నాథ్ గౌడ్ , కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు మధు భూపాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి , కృపాకర్ రావు, భాస్కర్, సురేష్ రావు, సురేష్ రెడ్డి, రఘుపతిరావు,చంద్ర శేఖర్, యాదిరెడ్డి, నర్సిరెడ్డి, జయచందర్ వెంకటేశ్వర్లు,వెంకటేశ్వర్ రెడ్డి, బాలాజీ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు…


