Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Telangana

కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాల్లో చిరునవ్వులు నింపింది- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు

Punnami Newsroom Published:

Story highlights

  • కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాల్లో చిరునవ్వులు నింపింది:— మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మల్లంపల్లి, అక్టోబర్ 2కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచిన గొప్ప సంక్షేమ పథకమని మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు…
  • ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ..
  • పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి భారం తగ్గించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు

For scrolling /publish

కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాల్లో చిరునవ్వులు నింపింది:— మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు

మల్లంపల్లి, అక్టోబర్ 2
కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచిన గొప్ప సంక్షేమ పథకమని మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు

కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభమై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మల్లంపల్లి మండలంలోని భాగ్య తండాకు చెందిన భానోత్ కీమా నాయక్–రుక్కమ్మ దంపతుల కుమార్తె కల్పన కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి భారం తగ్గించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు

(మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు)

కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా తెలంగాణలోని లక్షలాది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందని, ఆడబిడ్డల వివాహ సమయంలో తల్లిదండ్రులకు అండగా నిలిచి వారి కుటుంబాల్లో చిరునవ్వులు చిగురింపజేసిందని అన్నారు, పేదల సంక్షేమం, ఆడబిడ్డల గౌరవం కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాల్లో కళ్యాణ లక్ష్మి ఒక ముఖ్యమైన పథకమని పేర్కొన్నారు

కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు 13 లక్షల కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించామని, ఈ పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. తెలంగాణ గడ్డపై పుట్టిన కేసీఆర్ గారు రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలిపేలా అనేక సంక్షేమ పథకాలను రూపొందించారని అన్నారు

సీతక్క ములుగు అభివృద్ధిపై ప్రజలకు సమాధానం చెప్పాలి

ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతక్క ములుగు నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కార్యక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు డిమాండ్ చేశారు

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ములుగు ప్రాంత అభివృద్ధికి అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపట్టామని, గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశామని తెలిపారు. ములుగులో సుమారు రూ.250 కోట్లతో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య విద్య, వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు

అదేవిధంగా అప్పటి మంత్రి చందూలాల్ గారి కోరిక మేరకు సుమారు 350 ఎకరాల భూమిని కేటాయించి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు

ఒక్క కొత్త మండలం.. ఒక్క కొత్త గ్రామపంచాయతీ ఏర్పాటు చేశారా?

తాను గిరిజన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో మూడు కొత్త మండలాలను ఏర్పాటు చేశామని, వందకు పైగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశామని సత్యవతి రాథోడ్ గారు అన్నారు

“నేడు మీరు అధికారంలో ఉన్నారు. మా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్థాయిలో కాకపోయినా కనీసం ఒక్క కొత్త గ్రామపంచాయతీనైనా ఏర్పాటు చేసి ఉంటే చూపించండి, ఒక్కటైనా ఏర్పాటు చేసి ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సవాల్‌ను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?” అని మంత్రి సీతక్కను ప్రశ్నించారు

ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సత్యవతి రాథోడ్ గారు డిమాండ్ చేశారు

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న రూ.2,500, ఆడబిడ్డలకు ఇస్తామన్న తులం బంగారం, స్కూటీలు వంటి హామీల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందాల్సిన సన్నబియ్యం, పాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు

గత ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ వంటి పథకాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు అందిన సహాయాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని అన్నారు

కేసీఆర్ హయాంలోనే పరిపాలన ప్రజల ముంగిటకు వచ్చింది

ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారి తరఫున బీఆర్ఎస్ నాయకులు ముందుండి పోరాడారని సత్యవతి రాథోడ్ గారు అన్నారు ప్రజలు కలెక్టర్, ఎస్పీలను కలవడానికి ఇబ్బందులు పడకుండా అధికారులను ప్రజల ముంగిటకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు

కేసీఆర్ హయాంలోనే ములుగు జిల్లాగా ఏర్పడిందని, జిల్లాలు, మండలాల ఏర్పాటు ద్వారా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశామని అన్నారు

గిరిజనుల ఆదాయం, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలైన కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలలో భాగస్వాములైనందుకు గర్వంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలిగామని సత్యవతి రాథోడ్ గారు అన్నారు

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లో కళ్యాణ లక్ష్మి ని మరిచిన రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి ప్రజల ఇబ్బందులు చూడాలని డిమాండ్ చేశారు

కళ్యాణ లక్ష్మి పథకం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకాన్ని గుర్తు చేసుకుంటూ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచిన ఈ పథకాన్ని ప్రజలకు అందించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి మాలోత్ కవిత గారు, ములుగు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బడే నాగజ్యోతి గారు,ములుగు జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత గారు, మాజీ జడ్పీ చైర్మన్లు తుల ఉమా గారు, గండ్ర జ్యోతి గారు, బిందు ఆంగోత్ గారు, ఏటూర్ నాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీదేవి లక్ష్మణ్ బాబు గారు, హరి రమాదేవి గారు, ములుగు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ గారు, భూక్య జంపన్న గారు, విజయ్ గారు, గోపాల్ రెడ్డి గారు, మోహన్ గారు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *