హైదరాబాద్, సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి
రిహబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్.సిఐ) అనుమతి లేకుండా బ్యాచ్‌లర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజెస్ కోర్సులు నడుపుతున్న ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య, కోశాధికారి ఆర్. వెంకటేష్ సోమవారం రాష్ట్ర కమిషనర్, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్లకు వినతి పత్రం సమర్పించారు. 1992 ఆర్.సిఐ చట్టం ప్రకారం కోర్సులు ఆర్.సిఐ అనుమతితోనే నిర్వహించాలి. గాంధీ, ఉస్మానియా, కరీంనగర్, హన్మకొండ, మహబూబ్ నగర్ కళాశాలలు మూడు సంవత్సరాలుగా అనుమతి లేకుండా కోర్సులు నడుపుతున్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో విఫలమని, 2025-26 నోటిఫికేషన్ ముందు కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.


