కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మాతృభూమికి కళార్చన” పోటీలలో శుక్రవారం జూనియర్,సబ్ జూనియర్ విభాగాలలో పద్య పఠనం, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బాలలకు ఆంగ్ల రైమ్స్ పోటీలు నిర్వహించారు పద్య పఠనం పోటీలలో 110 మంది బాలలు రాగయుక్తంగా పద్యాలాపన తో అలరించారు 40 మంది చిన్నారులు ఆకట్టుకునే హావభావాలతో ఆంగ్లరైమ్స్ చెప్పారు న్యాయ నిర్ణేతలుగా సుజాత చంద్ర హాస రెడ్డి, గోపాల కృష్ణ, కమలాకర్, నీలకంఠమాచారి, ప్రసాద్ లు వ్యవహరించారు పోటీలను నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, ఉపాధ్యక్షులు పోసిన సుబ్బారావు, కార్యాలయ కార్యదర్శి వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.
శుక్రవారం చక్కటి చేతివ్రాత పోటీలు: శుక్రవారం టౌన్ హాల్ ప్రాంగణంలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో చక్కటి చేతి వ్రాత పోటీలు నిర్వహించడం జరుగుతుంది. శని ,ఆదివారాలలో నృత్య పోటీలు: శని వారం శాస్త్రీయ, జానపద నృత్య పోటీలు, ఆది వారం ఆధునిక, దేశ భక్తి నృత్యాల పోటీలు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో సోలో, బృంద నృత్య క్యాటగిరిలలో నిర్వహిస్తారు.

కళారాధనలో పద్య పఠనం, ఆంగ్ల రైమ్స్ పోటీలు రాగ యుక్తంగా పద్యాలు ఆలపించిన బాలలు
కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మాతృభూమికి కళార్చన” పోటీలలో శుక్రవారం జూనియర్,సబ్ జూనియర్ విభాగాలలో పద్య పఠనం, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బాలలకు ఆంగ్ల రైమ్స్ పోటీలు నిర్వహించారు పద్య పఠనం పోటీలలో 110 మంది బాలలు రాగయుక్తంగా పద్యాలాపన తో అలరించారు 40 మంది చిన్నారులు ఆకట్టుకునే హావభావాలతో ఆంగ్లరైమ్స్ చెప్పారు న్యాయ నిర్ణేతలుగా సుజాత చంద్ర హాస రెడ్డి, గోపాల కృష్ణ, కమలాకర్, నీలకంఠమాచారి, ప్రసాద్ లు వ్యవహరించారు పోటీలను నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, ఉపాధ్యక్షులు పోసిన సుబ్బారావు, కార్యాలయ కార్యదర్శి వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. శుక్రవారం చక్కటి చేతివ్రాత పోటీలు: శుక్రవారం టౌన్ హాల్ ప్రాంగణంలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో చక్కటి చేతి వ్రాత పోటీలు నిర్వహించడం జరుగుతుంది. శని ,ఆదివారాలలో నృత్య పోటీలు: శని వారం శాస్త్రీయ, జానపద నృత్య పోటీలు, ఆది వారం ఆధునిక, దేశ భక్తి నృత్యాల పోటీలు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో సోలో, బృంద నృత్య క్యాటగిరిలలో నిర్వహిస్తారు.

