పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : బుధవారం విలేఖరులు అందజేసిన ఒక ప్రకటనలో కప్పాటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో రాష్ట్రంలోని ప్రాజెక్టు పనులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణ జాగృతి జనం బాటలో కవిత ముంపు గ్రామాల్లో ప్రజల పరిస్థితిని తెలుసుకుంటూ, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని, ముంపు గ్రామాల్లో పునరావాస పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గత రెండు సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రెస్ మీట్‌లు, సోషల్ మీడియా విమర్శలతోనే సరిపెట్టుకున్నాయి తప్ప, ప్రజల మధ్యకు వెళ్లి వారి బాధలను తెలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. కానీ, కవితక్క నీళ్లు, నియామకాలు, నిధులు, అమరవీరులు, సామాజిక తెలంగాణ అంశాలపై ప్రజల్లోకి వెళ్లి మాట్లాడడంతో ప్రతిపక్ష పార్టీలు కలవరపడుతున్నాయి అని కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు.

కల్వకుంట్ల కవిత జనం బాట ఘన విజయం –రంగారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి