*కల్లుగీతసొసైటీలు, టిఎఫ్ టి గ్రామాలకే మద్యం షాపులలో రిజర్వేషన్స్ కల్పించాలి..*
*ఇచ్చిన మాట ప్రకారం 25% ఇవ్వాలి*
*ఎన్నికల హామీలన్నీ అమలు చేయాలి*
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గౌడులకు 15% రిజర్వేషన్స్ కల్పిస్తూ తెచ్చిన మద్యం పాలసీ వల్ల గీత కార్మికులకు ప్రయోజనమేమీ లేదని, సొసైటీ, టిఎఫ్ టి గ్రామాలకు ఇవ్వాలని, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్రఅధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాంనగర్ లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశంలో వారు మాట్లాడుతూ..
మద్యం షాపులలో రిజర్వేషన్స్ పెంచితే ప్రభుత్వానికి లాభం తప్ప నష్టం ఉండదన్నారు. మద్యం షాపుల టెండర్లలో గౌడులకు 15%, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్స్ గత టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. *కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గౌడులకు 25 శాతం పెంచుతామని చెప్పిందని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు.*
మద్యం వల్ల కల్లుగీత వృత్తి దెబ్బ తింటుందని గత టిఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ చొరవతో మద్యం షాపుల లో గౌడులకు 15% రిజర్వేషన్స్ కల్పించారు. ఫలితంగా 392 మంది ఆ.. అవకాశాన్ని ఉపయోగించుకున్నారని, కానీ దీని వల్ల ఇచ్చిన ఉద్దేశం నెరవేర లేదన్నారు. కల్లుగీత సొసైటీలకు,TFT గ్రామాలకు ఇచ్చినట్లయితే ఆర్థికంగా గీత కార్మికులకు ఉపయోగం జరుగుతుందన్నారు.
అందుకని ప్రభుత్వం పునరాలోచించి
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వెంకటరమణ కోరారు.
*బేవరేజెస్, డిస్టలరీస్, బాటిలింగ్ తదితర మద్యం ఉత్పత్తి రంగంలో కూడా రిజర్వేషన్స్ కల్పిస్తే సొసైటీలు బలోపేతం అవుతాయని గీత కార్మికులకు ఉపాధి కలుగుతుందన్నారు.*
ఈ..సమావేశంలో రాష్ట్రప్రధానకార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు, గౌని వెంకన్న, వెంకటనర్సయ్య, బాల్నే వెంకటమల్లయ్య, పామనగుండ్ల అచ్చాలు,
రాష్ట్ర కార్యదర్శులు చౌగాని సీతారాములు, బూడిద గోపి, ఎస్ రమేష్ గౌడ్, బండకింది అరుణ్, మడ్డి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.


