పున్నమి ప్రతినిధి తిరుపతి రూరల్
తరతరాలుగా ఇల్లు లేక అద్దె ఇంట్లో తల దాచుకుంటూ అనేక అవస్థలు పడుతున్నాం.. ఇంకెన్నాళ్లు అద్దె గృహాల్లో నివాసం ఉండాలి .. మాకు సొంతింటి కల నెరవేరదా? ఇంటి స్థలం ఇచ్చి పుణ్యం కట్టుకోండి మహాప్రభువు అంటూ తిరుపతి గ్రామీణ మండలం మల్లంగుంటలోని దళితులు రెవెన్యూ అధికారులను వేడుకున్నారు శుక్రవారం మల్లంగుంట పంచాయతీలోని సర్వేనెంబర్ 144 లోని 2-66 సెంట్లు ప్రభుత్వ భూమిలో పూరి గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు విషయం రెవెన్యూ అధికారులకు తెలియడంతో దళితులను అడ్డుకున్నారు ఈ సందర్భంగా సుమారు 500 కుటుంబాలు చెందిన దళితులు తమ బాధలను రెవెన్యూ అధికారులు ఎదుట వెళ్లిపుచ్చుకున్నారు ఎన్నో ఏళ్లుగా తమకు ఇంటి స్థలాలు లేక అద్దెఇంట్లో ఉంటూ బాడుగులు కట్టలేక అవస్థలు పడుతున్నామని అధికారులు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు కూలీ నాలీ చేసుకునే మాకు గూడు లేక అనేక అవస్థలు పడుతున్నామని తెలిపారు ప్రభుత్వ భూములను రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆక్రమించుకుంటుంటే పేదలకు నిలువు నీడ కోసం ఇంకెన్ని సంవత్సరాలు వేచి చూడాలని వాపోయారు మా జీవనమంత అద్దె భవనాల్లో మగ్గిపోవాలని అధికారులను వేడుకున్నారు ప్రభుత్వ భూములు ఇల్లు లేని దళితులకు ఇల్లు స్థలాలు ఇవ్వాలని మాజీ సర్పంచ్ భర్త రామచంద్రయ్య, ఉప సర్పంచ్ జయచంద్ర రెడ్డి, ఎంపీటీసీ భర్త హేమాద్రి లు డిమాండ్ చేశారు మాకు న్యాయం జరిగేంత వరకు కదలబోమని పట్టుబట్టారు
*అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఎమ్మార్వో*
దళితులు ప్రభుత్వ భూమిలో ప్రవేశించిన నేపథ్యంలో ఎమ్మార్వో తమ సిబ్బందితో నా స్థలానికి చేరుకున్నారు అనంతరం దళితుల బాధలను విన్న ఎమ్మార్వో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు రేషన్ కార్డులు తీసుకొని అర్జీ సమర్పించాలని సూచించారు అర్జీలను పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు దీంతో దళితులు వెనుతిరి గారు



