శ్రీ కాళహస్తి నియోజిక వర్గ దేలుగుదేశంపార్టీ నాయకులు టిడిపి బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ లు తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యిలో విషయంపై పత్రిక ప్రకటన విడుదలా చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా అత్యంత పవిత్రంగా స్వీకరించే శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని రసాయనాల మిశ్రమంతో తయారు చేసిన కల్తీ నెయ్యిని ఉపయోగించడం వెనుక అసలు సూత్రధారులు మాజీ సియం జగన్ రెడ్డి, అతని బాబాయ్ వైవి సుబ్బారెడ్డిలని ఆరోపించారు. తిరుమల లడ్డూని రసాయనాల లడ్డూగా మార్చింది నిజమే అని జగన్ బాబాయ్, నాటి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడని,ఆ లడ్డూలో ఏయే రసాయనాలు కలిసాయి అన్నది సీబీఐ, సిట్ ల దర్యాప్తు నివేదిక స్పష్టంగా చెప్పినప్పటికీ జగన్ & కో జనాన్ని మోసం చేయడానికి కథలు చెబుతూనే ఉన్నారని 2019-24 మధ్యకాలంలో ఐదేళ్లపాటు తిరుమల వెంకన్న ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని సుప్రీంకోర్టు వేసిన సిట్ నిర్ధారించడంతో దేశమంతా హిందువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, హిందూ మతంపై కక్షతో జగన్ రెడ్డి మరియు అతని బృందం శ్రీవారి సన్నిధిలో పాల్పడిన మహా పాపాలను జాతీయ మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రసారం చేస్తున్నా కూడా… కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసి బుకాయించడానికి సిగ్గు లేదని నిలదీశారు. 2022 వ సంవత్సరంలోనే లడ్డూ తయారీలో జరిగిన కల్తీ పై CFTRI రిపోర్ట్ ఇచ్చినా, జగన్ ప్రభుత్వం ఆ రిపోర్ట్ పై చర్యలు తీసుకోకుండా,దాన్ని తొక్కి పెట్టి, లడ్డూ కల్తీని కొనసాగించి మహా అపచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కాని నెయ్యిలో జంతువుల కొవ్వు, పామాయిల్ ఉన్నట్లు NDDB నివేదిక ఇచ్చిందని… ఇవి ముఖ్యమంత్రి చేసినవి ఆరోపణలు కావని వారు గుర్తు చేశారు. శ్రీవారి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో నెయ్యి బదులు కెమికల్స్ ఉపయోగించి తయారు చేసిన నెయ్యిని కలిపిన మహా పాపం శ్రీశైలంలోనూ జగన్ రెడ్డి యొక్క వైసీపీ పాలనలోనే జరిగిందని, మూడు లక్షలకు పైగా కేజీల కెమికల్స్ నెయ్యి శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రసాదమైన లడ్డూల్లో కలిపేసిన జగన్ గ్యాంగ్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని ఏ నివేదిక లోనూ క్లీన్‍చిట్ ఇవ్వలేదని, NDDB రిపోర్ట్ లో ఫిష్ ఆయిల్, పందికొవ్వు ఉందని రిపోర్ట్ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ చేశారని సిట్ తేల్చింది.ఈ కల్తీ లడ్డూలే అయోధ్యకి కూడా పంపించి మహా పాపం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు బాలసుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంటు బిసి విభాగం నాయకులు గంగనపల్లి రమేష్,కృష్ణమూర్తి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

కల్తీ నెయ్యిలో అసలుసూత్రధారులు జగన్ సుబ్బారెడ్డేలే-ఉమేష్ రావు,కోట చంద్రశేఖర్