అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి
ఈనెల 23 నుంచి 25 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు
మత్స్యకారులు వేటకు వెళ్లరాదు
24 గంటలు పని చేసేలా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కంట్రోలు రూం నెంబర్లు : 0861 2331261, 7995576699
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల…
నెల్లూరు, అక్టోబర్ 22 : తుఫాను కారణంగా జిల్లాలో
విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు.
ఈనెల 23 నుంచి 25 వరకు భారీ నుండి అతి భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తూ..ప్రజలు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై బుధవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
వర్షాల కారణంగా ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని, టామ్ టామ్ లేదా మైకుల ద్వారా (public address system) ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆర్డీవోలు, తహశీల్దార్లను ఆదేశించారు. అనుకోని అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ముందు జాగ్రత్తగా అనువైన ఆశ్రయ కేంద్రాల (shelters) ను గుర్తించి తరలించాలన్నారు.
అన్ని శాఖల అధికారులు ముఖ్యంగా మున్సిపల్, వైద్య, ఆరోగ్యం, విద్యుత్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ , విపత్తు నిర్వహణ (అగ్నిమాపక) తదితర శాఖల అధికారులు, వారి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అలాగే అధికారులు అందరూ జిల్లా కేంద్రం / వారు పనిచేసే స్థానంలోనే అందుబాటులో ఉండాలన్నారు. వర్షాలు ఆగిపోయే వరకు సెలవులు మంజూరు చేయమన్నారు.
ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24/7 పనిచేసే విధంగా కంట్రోల్ రూమును ఏర్పాటు చేసి అందులో షిఫ్ట్ సిస్టం లో పని చేసే విధంగా సిబ్బందిని నియమించామన్నారు. ప్రజల నుండి కంట్రోల్ రూమ్ కి కాల్స్ వచ్చిన వెంటనే తగు సహాయం అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడైన వాటర్ లాగింగ్ ఉంటే వెంటనే ఆ నీటిని క్లియర్ చేయాలన్నారు. నిరంతర విద్యుత్తు సరఫరా ఉండాలన్నారు. చెరువులు, కాల్వలు, ప్రాజెక్టుల వద్ద సిబ్బందిని ఉంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తనకు తెలియచేయాలన్నారు.
*కంట్రోల్ రూమ్ నెంబర్లు:*
**👉 జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, నెల్లూరు కంట్రోల్ రూమ్ : 0861 2331261, 7995576699**
*భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రజలకు చేసిన సూచనలు* :
👉భారీ వర్షాలు కురిసేటప్పుడు అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలి*
👉నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లో ని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
👉 భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి*
👉భారీవర్షం పడేప్పుడు బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదు*
👉వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద ఉండరాదు*
👉నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లో ని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
👉భారీ వర్షాల వల్ల చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండొచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన ఇసుక బ్యాగ్స్ ను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు ఆదేశం.
👉 పూరి గుడిసెలు, పాత మిద్దెలు, మట్టితో కట్టిన ఇళ్ళల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
👉అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే పైన తెలిపిన కంట్రోల్ రూమ్ నంబరుకు ఫోన్ చేయండి
*వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు..*
👉*తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు*
👉 *తడిసిన చేతులతో స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు.*
👉 *విద్యుత్ లైన్ కు తగులుతున్న చెట్లను ముట్టుకోరాదు.*
👉*విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి తెలియచేయవలెను.*
👉*పార్కులలో గాని స్టేడియంలో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు.*
👉*ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు..*
👉 *బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి.*
👉 *కరెంటు కు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు.*
👉 *చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.*
👉 *ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు..*
👉 *గాలి,దుమారం,వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు.*
*👉ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టవలెను.*
👉 *ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు డిష్ కనెక్షన్ తీసివేయవలెను.*
*👉వర్షం పడుతున్నప్పుడు టీవీ,ఫ్రిడ్జ్ మరియు కంప్యూటర్ ల యొక్క స్విచ్ లను ఆఫ్ చేయవలెను, లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది.*
👉 *కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు.*
*👉ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైన డ్యామేజ్ అయినచో సంబంధించిన అధికారి JLM, ALM, LM లేదా AE దృష్టికి తీసుకెల్లాలి.*


