Monday, 8 December 2025
  • Home  
  • కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక*
- విశాఖపట్నం

కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక*

* కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి *జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి * విశాఖపట్నం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమం జరుగుతుందని, అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్ కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోను చెక్ చేసుకోవచ్చన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్ ను వాట్స్అప్ లో అందజేస్తున్నామని, ఎండార్స్మెంట్ ను రిజిస్టర్ పోస్ట్ ద్వారా సంబంధిత చిరునామాకు పంపిస్తున్నామని చెప్పారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలన్నారు. జిల్లా ప్రజలు పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో కోరారు. *కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి* అర్జిదారులు మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను సంప్రదించవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

* కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక*

*మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి

*జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

*విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి * విశాఖపట్నం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమం జరుగుతుందని, అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్ కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోను చెక్ చేసుకోవచ్చన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్ ను వాట్స్అప్ లో అందజేస్తున్నామని, ఎండార్స్మెంట్ ను రిజిస్టర్ పోస్ట్ ద్వారా సంబంధిత చిరునామాకు పంపిస్తున్నామని చెప్పారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలన్నారు. జిల్లా ప్రజలు పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో కోరారు.

*కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి*

అర్జిదారులు మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను
వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను సంప్రదించవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.