కలువాయి నూతన ఎస్సై గా ఎస్ కోటయ్య కలువాయి
సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సై గా పనిచేస్తున్న సుమన్ గత నెలలో బదిలీకాగా కండలేరు ఎస్సై రామకృష్ణ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించేవారు. ఉన్నతాధికారులు కోటయ్యను రెగ్యులర్ ఎస్సైగా నియమించడంతో ఆయన సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, స్నేహపూర్వక వాతావరణం లో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.