Tuesday, 24 March 2026
  • Home  
  • కలసి ఉంటే, కలదు సుఖం ..- ఐక్యతతో ప్రతీ సవాలును స్వీలరించగలం – లయన్స్ డా.పైడి.సింధూర (శ్రీకాకుళం – అక్టోబర్ పున్నమి ప్రతినిధి)
- ఆంధ్రప్రదేశ్

కలసి ఉంటే, కలదు సుఖం ..- ఐక్యతతో ప్రతీ సవాలును స్వీలరించగలం – లయన్స్ డా.పైడి.సింధూర (శ్రీకాకుళం – అక్టోబర్ పున్నమి ప్రతినిధి)

కలసి ఉంటె, కలదు సుఖం, ఐక్యతతో పోరాడితే విజయం తధ్యమని లయన్స్ డా.పైడి.సింధూర అన్నారు. స్థానిక శాంతినగర్ గాంధీ మందిర ప్రాంగణంలో, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ జయంతి వేడుకలను, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ స్వేచ్ఛ కోసం పోరాడిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ గౌరవార్ధం ఆయన జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవం పేరుతో జరుపుకుంటున్నామని, ఆయన చర్యల ఫలితంగానే హైదరాబాద్, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారత్ లో విలీనమయ్యాయన్నారు. ఈ ఏడాది ‘నా మట్టి.. నా దేశం’ అనే థీమ్‌ను ఎంపిక చేశారని, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య యోధులను గౌరవించడం.. జాతీయ ఐక్యత, రాష్ట్రీయ ఏక్తా స్ఫూర్తిని ప్రచారం చేయడమే దీని ప్రధాన ఉద్దేసమని, మరణానంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదును ఇచ్చి గౌరవించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం .రామ్ గోపాల్, కోశాధికారి బరాటం.కృష్ణ చైతన్య, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ.రవి కుమార్, మార్కెటింగ్ ఛైర్పర్సన్ పొడుగు.చరణ్ , సీనియర్ సభ్యులు గుత్తు.చిన్నా రావు, సభ్యులు చౌదరి .శ్రీనివాస్, బిజెపి మహిళా నాయకురాలు సిరిపురం. త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

కలసి ఉంటె, కలదు సుఖం, ఐక్యతతో పోరాడితే విజయం తధ్యమని లయన్స్ డా.పైడి.సింధూర అన్నారు. స్థానిక శాంతినగర్ గాంధీ మందిర ప్రాంగణంలో, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ జయంతి వేడుకలను, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ స్వేచ్ఛ కోసం పోరాడిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ గౌరవార్ధం ఆయన జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవం పేరుతో జరుపుకుంటున్నామని, ఆయన చర్యల ఫలితంగానే హైదరాబాద్, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారత్ లో విలీనమయ్యాయన్నారు. ఈ ఏడాది ‘నా మట్టి.. నా దేశం’ అనే థీమ్‌ను ఎంపిక చేశారని, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య యోధులను గౌరవించడం.. జాతీయ ఐక్యత, రాష్ట్రీయ ఏక్తా స్ఫూర్తిని ప్రచారం చేయడమే దీని ప్రధాన ఉద్దేసమని, మరణానంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదును ఇచ్చి గౌరవించిందని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం .రామ్ గోపాల్, కోశాధికారి బరాటం.కృష్ణ చైతన్య, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ.రవి కుమార్, మార్కెటింగ్ ఛైర్పర్సన్ పొడుగు.చరణ్ , సీనియర్ సభ్యులు గుత్తు.చిన్నా రావు, సభ్యులు చౌదరి .శ్రీనివాస్, బిజెపి మహిళా నాయకురాలు సిరిపురం. త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.