కలిగిరి మండల కేంద్రంలోని ప్రాచీన శివాలయ పునఃనిర్మాణంపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. నేషనల్ హైవే విస్తరణ ప్రభావం నేపథ్యంలో ఆలయానికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించారు. స్థల పరిమాణం, నిర్మాణ రూపకల్పన, భక్తుల సౌకర్యాలపై అధికారులతో పాటు ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సంప్రదాయాలను కాపాడుతూ ఆధునిక సదుపాయాలతో ఆలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సూచించారు.


