Friday, 6 February 2026
  • Home  
  • కలిగిరి మండలంలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా….!!
- ఆంధ్రప్రదేశ్

కలిగిరి మండలంలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా….!!

కలిగిరి, అక్టోబర్ 07 :(పున్నమి న్యూస్):/// నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా. మండలంలో అనేకచోట్ల ఎటువంటి అనుమతులు లేకుండా భారీగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు. కలిగిరి పట్టణంలోని పెద్ద చెరువు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఒక జెసిబి 20 ట్రాక్టర్లతో ఇదేచ్ఛగా భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్నారు. మరోవైపు రావులకొల్లు చెరువు నుంచి భారీ యంత్రాలతో గత నెల రోజుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా కలిగిరి నుంచి వలేటివారిపాలెం రోడ్డు నిర్మాణానికి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు ఈ అక్రమ దందాపై సమాచారం అందించిన స్పందించడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అందుబాటులో లేనప్పుడు అక్రమ గ్రావెల్ మాఫియాదారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ అక్రమ గ్రావెల్ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కలిగిరి, అక్టోబర్ 07 :(పున్నమి న్యూస్):///

నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా. మండలంలో అనేకచోట్ల ఎటువంటి అనుమతులు లేకుండా భారీగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు. కలిగిరి పట్టణంలోని పెద్ద చెరువు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఒక జెసిబి 20 ట్రాక్టర్లతో ఇదేచ్ఛగా భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్నారు. మరోవైపు రావులకొల్లు చెరువు నుంచి భారీ యంత్రాలతో గత నెల రోజుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా కలిగిరి నుంచి వలేటివారిపాలెం రోడ్డు నిర్మాణానికి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు ఈ అక్రమ దందాపై సమాచారం అందించిన స్పందించడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అందుబాటులో లేనప్పుడు అక్రమ గ్రావెల్ మాఫియాదారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ అక్రమ గ్రావెల్ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.