Thursday, 5 February 2026
  • Home  
  • కలంకారీ వస్త్రాలు దేశవిదేశాల్లో భారీ డిమాండ్ -ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

కలంకారీ వస్త్రాలు దేశవిదేశాల్లో భారీ డిమాండ్ -ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి సమీపంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉన్న హస్తకళ కేంద్రాన్ని బుధవారం నాడు స్థానిక శాసన సభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పరివేక్షించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో సంప్రదాయ కళలకు కొత్త ఊపునిచ్చే విధంగా, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. AP టూరిజం ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న హస్తకళ కేంద్రంలో, కళాకారులు తమ ఉత్పత్తులను దళారుల జోక్యం లేకుండా నేరుగా విక్రయించుకునే సౌకర్యం అందించనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి ప్రాంతానికి ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొచ్చిన కలంకారీ కళకు ప్రాధాన్య స్థానాన్ని ఇవ్వడం. “దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కలంకారీ కళాకారులు తమ ఉత్పత్తులకు సరైన ధర దొరకాలని, మధ్యవర్తుల కారణంగా కలిగే నష్టాన్ని పూర్తిగా తొలగించాలని” ఎమ్మెల్యే స్పష్టంచేశారు. కొత్త హస్తకళ భవనంలో 10 ప్రత్యేక గదులు కలంకారి, చేనేత, కోయ్య బొమ్మలు, ఇతర చేతివృత్తుల కళాకారుల కోసం కేటాయించనున్నట్లు ఆయన చెప్పారు. కలంకారీ కళాకారుల కోసం ‘డైరెక్ట్ సేల్స్’ మార్గం కలంకారీ వస్త్రాలు దేశవిదేశాల్లో భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, స్థానిక కళాకారులు అందుకునే లాభం మాత్రం చాలా తక్కువగా ఉండటం పెద్ద సమస్యగావుందని ఈ నేపథ్యంలో కొత్త వ్యవస్థ కళాకారులకు నేరుగా లాభం చేకూర్చేలా రూపుదిద్దుకుంటోందన్నారు. కళాకారులే స్వయంగా తమ ఉత్పత్తులు విక్రయించే అవకాశం కల్పిస్తూ మధ్యవర్తులు, దళారీ వ్యవస్థ పూర్తిగా తొలగింపు, కళాకారులే తమ ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛ కలంకారీ ప్రాముఖ్యతను ఎత్తి చూపే ప్రత్యేక ప్రదర్శన/విక్రయ వేదిక చేతిపని, నేచురల్ డైస్‌తో తయారయ్యే ఈ పురాతన కళను ప్రభుత్వ స్థాయిలో ప్రోత్సహించడం ప్రాంతీయ అభివృద్ధికి కీలకం అని అధికారులు భావిస్తున్నారన్నారు. కళాకారులకు ఎమ్మెల్యే హామీలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్న ముఖ్య అంశాలు: హస్తకళ భవనంలో 10 రూముల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి కళాకారులకే కేటాయింపు డైరెక్ట్ సేల్స్ మోడల్ ద్వారా కళాకారుల ఆదాయం పెంచే చర్యలు కలంకారీ, చేనేత, కోయ బొమ్మలు వంటి సంప్రదాయ కళలకు శాశ్వత విక్రయ వేదిక స్థానిక కళలకు మార్కెట్‌ను విస్తరించే కార్యక్రమాలు, ప్రోత్సాహక చర్యలు స్థానిక కళల పునరుజ్జీవనానికి మార్గదర్శక నిర్ణయం ఈ నిర్ణయంతో కలంకారీ కళాకారులకు న్యాయమైన ధర, స్థిరమైన ఆదాయం శ్రీకాళహస్తి హస్తకళలకు పెరుగుతున్న గుర్తింపు యువతలో చేతివృత్తులపై ఆసక్తి పెరుగుదల చిన్న–పెద్ద కళాకారులకు ఒకే వేదికలో విక్రయ అవకాశాలు కళాకారులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, “ఇది మా కళకు వచ్చిన భారీ గౌరవం… మా కుటుంబాలకి కొత్త ఆశ” అని పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి సమీపంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉన్న హస్తకళ కేంద్రాన్ని బుధవారం నాడు స్థానిక శాసన సభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పరివేక్షించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో సంప్రదాయ కళలకు కొత్త ఊపునిచ్చే విధంగా, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. AP టూరిజం ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న హస్తకళ కేంద్రంలో, కళాకారులు తమ ఉత్పత్తులను దళారుల జోక్యం లేకుండా నేరుగా విక్రయించుకునే సౌకర్యం అందించనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి ప్రాంతానికి ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొచ్చిన కలంకారీ కళకు ప్రాధాన్య స్థానాన్ని ఇవ్వడం.
“దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కలంకారీ కళాకారులు తమ ఉత్పత్తులకు సరైన ధర దొరకాలని, మధ్యవర్తుల కారణంగా కలిగే నష్టాన్ని పూర్తిగా తొలగించాలని” ఎమ్మెల్యే స్పష్టంచేశారు.

కొత్త హస్తకళ భవనంలో 10 ప్రత్యేక గదులు కలంకారి, చేనేత, కోయ్య బొమ్మలు, ఇతర చేతివృత్తుల కళాకారుల కోసం కేటాయించనున్నట్లు ఆయన చెప్పారు.
కలంకారీ కళాకారుల కోసం ‘డైరెక్ట్ సేల్స్’ మార్గం
కలంకారీ వస్త్రాలు దేశవిదేశాల్లో భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, స్థానిక కళాకారులు అందుకునే లాభం మాత్రం చాలా తక్కువగా ఉండటం పెద్ద సమస్యగావుందని ఈ నేపథ్యంలో కొత్త వ్యవస్థ కళాకారులకు నేరుగా లాభం చేకూర్చేలా రూపుదిద్దుకుంటోందన్నారు. కళాకారులే స్వయంగా తమ ఉత్పత్తులు విక్రయించే అవకాశం కల్పిస్తూ మధ్యవర్తులు, దళారీ వ్యవస్థ పూర్తిగా తొలగింపు,
కళాకారులే తమ ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛ కలంకారీ ప్రాముఖ్యతను ఎత్తి చూపే ప్రత్యేక ప్రదర్శన/విక్రయ వేదిక చేతిపని, నేచురల్ డైస్‌తో తయారయ్యే ఈ పురాతన కళను ప్రభుత్వ స్థాయిలో ప్రోత్సహించడం ప్రాంతీయ అభివృద్ధికి కీలకం అని అధికారులు భావిస్తున్నారన్నారు.
కళాకారులకు ఎమ్మెల్యే హామీలు
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్న ముఖ్య అంశాలు:
హస్తకళ భవనంలో 10 రూముల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి కళాకారులకే కేటాయింపు
డైరెక్ట్ సేల్స్ మోడల్ ద్వారా కళాకారుల ఆదాయం పెంచే చర్యలు కలంకారీ, చేనేత, కోయ బొమ్మలు వంటి సంప్రదాయ కళలకు శాశ్వత విక్రయ వేదిక స్థానిక కళలకు మార్కెట్‌ను విస్తరించే కార్యక్రమాలు, ప్రోత్సాహక చర్యలు స్థానిక కళల పునరుజ్జీవనానికి మార్గదర్శక నిర్ణయం
ఈ నిర్ణయంతో కలంకారీ కళాకారులకు న్యాయమైన ధర, స్థిరమైన ఆదాయం శ్రీకాళహస్తి హస్తకళలకు పెరుగుతున్న గుర్తింపు యువతలో చేతివృత్తులపై ఆసక్తి పెరుగుదల
చిన్న–పెద్ద కళాకారులకు ఒకే వేదికలో విక్రయ అవకాశాలు కళాకారులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, “ఇది మా కళకు వచ్చిన భారీ గౌరవం… మా కుటుంబాలకి కొత్త ఆశ” అని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.