కర్నూలు బస్సు ప్రమాదంలో మృత్యుంజయుడు
తృటిలో తప్పించుకున్న చంద్రయాన్ పల్లి యువకుడు కడారి అశోక్
అక్టోబర్ 25 పున్నమి న్యూస్
మాడుగుల : ఆంధ్ర ప్రదేశ్ కర్నూల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన అగ్నికి ఆహుతై ప్రైవేటు ట్రావెల్ బస్సు ఘటనలో నుంచి సంగారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు తృటిలో బయటపడ్డాడు ప్రమాదానికి గురైన బస్సులో నుంచి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం చంద్ర ఆన్పల్లి గ్రామానికి చెందిన యువకుడు కడారి అశోక్ మృత్యుంజయుడుగా బయటపడ్డాడు అనంతపురంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆయన పండుగకు స్వగ్రామానికి వచ్చాడు అనంతపురం విధులకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో గురువారం అనంతపురం కు బయలుదేరి వెళ్లాడు తెల్లవారుజామున జరిగిన బస్సు బస్సు ప్రమాదాన్ని పసిగట్టిన యువకుడు అద్దాలు పగలగొట్టి బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఆయన కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందాడు ప్రమాదంలో తనకు ఏం జరగలేదని క్షేమంగా ఉన్నానని యువకుడు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు


