అనంతసాగరం మండలం ఏప్రిల్ 22 (పున్నమి విలేఖరి): స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు కరోనా పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపిడిఓ హేమలతగారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో మండలంలోని25 పంచాయతీల సర్పంచులు, వార్డ్ నెంబర్లు, సచివాలయ సిబ్బంది,వాలంటీర్లను అవగాహన మరియు వ్యాక్సిన్ పై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించే విధంగా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని ప్రతి పంచాయతీలో కూడా కారణమని ఎలా అడ్డుకోవాలో ప్రజల్లో అవగాహన ఎలా తీసుకురావాలో వివరంగా వీరికి తెలియజేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం వీడి కరోనా వ్యాప్తిని అడ్డుకునేలా తమ పంచాయతీల్లో తగిన చర్యలు తీసుకోవాలని ప్రజల్లో అవగాహన తీసుకురావాలని వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు తొలగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హేమలత గారు ఈ ఓ పి ఆర్ అండ్ ఆర్ డి జి శ్రీనివాసరావు ట్రైనింగ్ టి ఓ టి చంద్రశేఖర్ రెడ్డి నరసింహులు వినోద్ గ్రామ సర్పంచులు వార్డ్ నెంబర్లు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.