నెల్లూరు బ్యూరో ( జూలై పున్నమి)
పచ్చని కరేడు భూములకు నోటిఫికేషన్ ఇచ్చి తమ పరం చేసుకోవాలన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వచ్చిన రైతులకు అండగా నిలిచిన తొలి వ్యక్తి బీసీ నేత బోడె రామచంద్ర యాదవ్ కాగా రైతుల ఆవేదనను వెంటనే గమనించి ఉద్యమానికి ఆజ్యం పోసిన నేత ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు. ఈ నెల నాలుగో తేదీన బోడె రామచంద్ర యాదవ్ రైతుల అందరిని సమీకరించి వారి కష్టాన్ని బయట ప్రపంచానికి తెలిపారు. రామాయపట్నం పోర్టు తదితర అంశాలపై గత ప్రభుత్వంలో పూర్తి అవగాహన ఉన్న తూమాటి మాధవరావు వెంటనే స్పందిస్తూ సమస్యను ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఆయనతో రైతులను భేటీ చేయడంతో ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశమైంది. ఇదే సమయంలో ముందుగా సిపిఐ నేతలు కూడా రైతులకు మద్దతుగా తమ వంతు పాత్ర ఉందని ముందుకు రావడంతో అనుబంధంగా సిపిఎం కూడా ఒక చేయి వేసింది. దీంతో భూములను కాపాడుకోవాలనే రైతులకు భారీగానే ధైర్యం చేకూరింది. మరో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా తాము సైతం అంటూ మద్దతు ప్రకటించడంతో కరేడులో ప్రభుత్వ నోటిఫికేషన్ కు కదలిక లేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై తొలి వారం రోజులు దాగుడుమూతలతో వ్యవహరించిన స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూడా రైతుల ఆగ్రహాన్ని గమనించి వారికి అన్యాయం జరగనివ్వమని వారి అభీష్టం మేరకే నిర్ణయాలు ఉంటాయని ఆలస్యం గా నైనా తీపి పలుకులు పలకడంతో కరేడు సమస్యపై తొందరపాటు చర్యలు తీసుకుంటే ఇబ్బంది అనే హెచ్చరికలు ప్రభుత్వ దృష్టికి చేరుకున్నాయి. నూతన పరిశ్రమ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలు రైతులకు ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయని వీటిపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కరేడు లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు కందుకూరు వైసీపీ ఇంచార్జ్ బుర్ర మధుసూదన్ తెలపడంతో ఉద్యమం చేస్తున్న రైతులు కూడా మరింత సంఘటితమయ్యారు. ఈ విషయంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఇంటూరి స్పందన స్పష్టం చేసినా కూటమిలో కీలకంగా ఉన్న బిజెపి జనసేన నేతలు ఇంతవరకు అడ్రస్ లేకపోవడం గమనార్హం.. ప్రజల్లో తాము సైతం అంటూ రైతుల సంక్షేమమే లక్ష్యం అంటున్న జనసేన బిజెపి నేతలు కరేడు ఉద్యమం దరిదాపులకు రాకపోవడం ఆ పార్టీలకు ప్రధాన లోపంగా నష్టం జరిగేదిగా భావిస్తున్నారు. కరేడు సమస్యపై ప్రతిపక్ష పార్టీలు ఎవరు పార్టీకి వారు తమ అజెండాగా ఇప్పటివరకు వ్యవవరిస్తున్నారు తప్ప సంఘటితంగా ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అయితే మొదటగా ఈ సమస్యపై స్పందించి రైతుల ముందు అధికారులు నిలదీసిన రామచంద్ర యాదవ్ ఉద్యమానికి దూరమవుతున్నారని ప్రకటించడం మరో మలుపు. తాను లేవనెత్తిన సమస్యపై రైతులు తనతో కాకుండా ప్రతిపక్ష నేత జగన్ వద్దకి తీసుకుపోవడం ఆయనకు కష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .మొత్తం మీద రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఒక చిన్న గ్రామానికి చెందిన రైతులు ఈ స్థాయిలో సంఘటితంగా ముందుకు వచ్చి సమస్య మీద పోరు చేయడం ఇదే ప్రథమంగా భావించవచ్చు. రైతుల భూ ఉద్యమం లో కరేడు కి ఒక ముఖ్యమైన పేజీ ఉండొచ్చు.

కరేడు కన్నీటికి అడ్డుకట్ట వేసింది ఎవరు తొలి అడుగులో బోడే… వేగం పెంచిన తూమాటి
నెల్లూరు బ్యూరో ( జూలై పున్నమి) పచ్చని కరేడు భూములకు నోటిఫికేషన్ ఇచ్చి తమ పరం చేసుకోవాలన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వచ్చిన రైతులకు అండగా నిలిచిన తొలి వ్యక్తి బీసీ నేత బోడె రామచంద్ర యాదవ్ కాగా రైతుల ఆవేదనను వెంటనే గమనించి ఉద్యమానికి ఆజ్యం పోసిన నేత ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు. ఈ నెల నాలుగో తేదీన బోడె రామచంద్ర యాదవ్ రైతుల అందరిని సమీకరించి వారి కష్టాన్ని బయట ప్రపంచానికి తెలిపారు. రామాయపట్నం పోర్టు తదితర అంశాలపై గత ప్రభుత్వంలో పూర్తి అవగాహన ఉన్న తూమాటి మాధవరావు వెంటనే స్పందిస్తూ సమస్యను ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఆయనతో రైతులను భేటీ చేయడంతో ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశమైంది. ఇదే సమయంలో ముందుగా సిపిఐ నేతలు కూడా రైతులకు మద్దతుగా తమ వంతు పాత్ర ఉందని ముందుకు రావడంతో అనుబంధంగా సిపిఎం కూడా ఒక చేయి వేసింది. దీంతో భూములను కాపాడుకోవాలనే రైతులకు భారీగానే ధైర్యం చేకూరింది. మరో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా తాము సైతం అంటూ మద్దతు ప్రకటించడంతో కరేడులో ప్రభుత్వ నోటిఫికేషన్ కు కదలిక లేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై తొలి వారం రోజులు దాగుడుమూతలతో వ్యవహరించిన స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూడా రైతుల ఆగ్రహాన్ని గమనించి వారికి అన్యాయం జరగనివ్వమని వారి అభీష్టం మేరకే నిర్ణయాలు ఉంటాయని ఆలస్యం గా నైనా తీపి పలుకులు పలకడంతో కరేడు సమస్యపై తొందరపాటు చర్యలు తీసుకుంటే ఇబ్బంది అనే హెచ్చరికలు ప్రభుత్వ దృష్టికి చేరుకున్నాయి. నూతన పరిశ్రమ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలు రైతులకు ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయని వీటిపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కరేడు లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు కందుకూరు వైసీపీ ఇంచార్జ్ బుర్ర మధుసూదన్ తెలపడంతో ఉద్యమం చేస్తున్న రైతులు కూడా మరింత సంఘటితమయ్యారు. ఈ విషయంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఇంటూరి స్పందన స్పష్టం చేసినా కూటమిలో కీలకంగా ఉన్న బిజెపి జనసేన నేతలు ఇంతవరకు అడ్రస్ లేకపోవడం గమనార్హం.. ప్రజల్లో తాము సైతం అంటూ రైతుల సంక్షేమమే లక్ష్యం అంటున్న జనసేన బిజెపి నేతలు కరేడు ఉద్యమం దరిదాపులకు రాకపోవడం ఆ పార్టీలకు ప్రధాన లోపంగా నష్టం జరిగేదిగా భావిస్తున్నారు. కరేడు సమస్యపై ప్రతిపక్ష పార్టీలు ఎవరు పార్టీకి వారు తమ అజెండాగా ఇప్పటివరకు వ్యవవరిస్తున్నారు తప్ప సంఘటితంగా ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అయితే మొదటగా ఈ సమస్యపై స్పందించి రైతుల ముందు అధికారులు నిలదీసిన రామచంద్ర యాదవ్ ఉద్యమానికి దూరమవుతున్నారని ప్రకటించడం మరో మలుపు. తాను లేవనెత్తిన సమస్యపై రైతులు తనతో కాకుండా ప్రతిపక్ష నేత జగన్ వద్దకి తీసుకుపోవడం ఆయనకు కష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .మొత్తం మీద రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఒక చిన్న గ్రామానికి చెందిన రైతులు ఈ స్థాయిలో సంఘటితంగా ముందుకు వచ్చి సమస్య మీద పోరు చేయడం ఇదే ప్రథమంగా భావించవచ్చు. రైతుల భూ ఉద్యమం లో కరేడు కి ఒక ముఖ్యమైన పేజీ ఉండొచ్చు.