డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా :
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (APPTA) నేతలు ప్రభుత్వం జారీ చేసిన కరువు భత్యం (DA) సంబంధిత జీవోలు 60, 61లలో చూపిన బకాయిల చెల్లింపు విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫ్యాప్టో పోరాటం మరియు అనేక సంఘాల ప్రాతినిధ్యాల తర్వాత ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి గారితో జరిగిన చర్చల అనంతరం పేరివిజన్ కమిషన్ మరియు బకాయిల చెల్లింపులను పక్కనపెట్టి కేవలం ఒకే ఒక్క డీఏను విడుదల చేయడం ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించిందని తెలిపారు.
జిల్లా అధ్యక్షులు చింతాడ రాము, ప్రధాన కార్యదర్శి బి. నరసింగరావు మాట్లాడుతూ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 19 నెలల బకాయిలను రిటైర్మెంట్ సమయానికి ఇవ్వడం, పెన్షనర్లకు 2027–28 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు చేయడం అనేది విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. అలాగే సీపీఎస్ వారికి ఇవ్వవలసిన 90% నగదు జమపై ఎటువంటి ప్రస్తావన లేకపోవడం సరికాదని, జీవోలు 60, 61లు సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.
వెంటనే సదరు జీవోలను సవరించి, సర్వీసులో ఉన్న వారి డీఏ బకాయిలను వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని, రిటైర్ అయిన వారికి వెంటనే పూర్తి చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవోలు ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావాన్ని పెంపొందిస్తున్నాయని ఆప్టా నేతలు హెచ్చరించారు.
ధన్యవాదాలతో,
మీ భవదీయులు,
షబ్బీర్ హుస్సేన్, జిల్లా అధ్యక్షులు
షానవాజ్ హుస్సేన్ మాజింద్రని, జిల్లా ప్రధాన కార్యదర్శి
ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ – డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా


