Friday, 13 February 2026
  • Home  
  • కరీంనగర్ ప్రజల తీర్పుతో బీజేపీకి బలమైన మద్దతు – ఖమ్మం కార్పొరేషన్‌లో కూడా విజయం సాధిస్తాం: గల్లా సత్యనారాయణ
- ఖమ్మం

కరీంనగర్ ప్రజల తీర్పుతో బీజేపీకి బలమైన మద్దతు – ఖమ్మం కార్పొరేషన్‌లో కూడా విజయం సాధిస్తాం: గల్లా సత్యనారాయణ

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి పట్టం కట్టిన కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలకు పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్య నారాయణ తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పట్ల కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలు చూపిన ఆధారభిమనము వెల కట్టలేనిది అని అయన అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఇచ్చిన మద్దతు పార్టీపై వారి విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని, అందుకే ప్రజలు పార్టీకి విజయాన్ని అందించారని అన్నారు. అలాగే రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ తన సత్తాను చాటుతుందని గల్లా సత్య నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పని చేస్తుందని, ఖమ్మం నగర అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కృషితో రాబోయే ఎన్నికల్లో బీజేపీ మరింత బలంగా ముందుకు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి పట్టం కట్టిన కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలకు పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్య నారాయణ తెలిపారు.
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పట్ల కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలు చూపిన ఆధారభిమనము వెల కట్టలేనిది అని అయన అన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఇచ్చిన మద్దతు పార్టీపై వారి విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని, అందుకే ప్రజలు పార్టీకి విజయాన్ని అందించారని అన్నారు.
అలాగే రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ తన సత్తాను చాటుతుందని గల్లా సత్య నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పని చేస్తుందని, ఖమ్మం నగర అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కృషితో రాబోయే ఎన్నికల్లో బీజేపీ మరింత బలంగా ముందుకు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.