Thursday, 5 February 2026
  • Home  
  • కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గొప్ప నిర్ణయం – పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులు స్వయంగా భరించనున్న సంజయ్ కుమార్:
- తెలంగాణ

కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గొప్ప నిర్ణయం – పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులు స్వయంగా భరించనున్న సంజయ్ కుమార్:

పువ్వాడ నాగేంద్ర కూమర్ (తెలంగాణ పున్నమి ప్రతి నిధి) కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల ఫీజు భారం లేకుండా చేయాలని కరీంనగర్ ఎంపీ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజును తన వేతనం నుండి పూర్తిగా చెల్లించనున్నట్టు ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 12,292 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్నారు. కరీంనగర్ జిల్లా – 4,847 మంది సిరిసిల్ల జిల్లా – 4,059 మంది సిద్ధిపేట జిల్లా – 1,118 మంది జగిత్యాల జిల్లా – 1,135 మంది హన్మకొండ జిల్లా – 1,133 మంది వారి పరీక్ష ఫీజుల కోసం సుమారు ₹15 లక్షలు అవసరమవుతాయని, ఆ మొత్తాన్ని తన వేతనం నుండి భరించనున్నట్టు ఎంపీ తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే లేఖలు పంపించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రేరణతో, “వికసిత్ భారత్” కల సాకారం చేయడంలో తన వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

పువ్వాడ నాగేంద్ర కూమర్
(తెలంగాణ పున్నమి ప్రతి నిధి)

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల ఫీజు భారం లేకుండా చేయాలని కరీంనగర్ ఎంపీ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి
బండి సంజయ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజును తన వేతనం నుండి పూర్తిగా చెల్లించనున్నట్టు ప్రకటించారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 12,292 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్నారు.
కరీంనగర్ జిల్లా – 4,847 మంది
సిరిసిల్ల జిల్లా – 4,059 మంది
సిద్ధిపేట జిల్లా – 1,118 మంది
జగిత్యాల జిల్లా – 1,135 మంది
హన్మకొండ జిల్లా – 1,133 మంది

వారి పరీక్ష ఫీజుల కోసం సుమారు ₹15 లక్షలు అవసరమవుతాయని, ఆ మొత్తాన్ని తన వేతనం నుండి భరించనున్నట్టు ఎంపీ తెలిపారు.
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే లేఖలు పంపించారు.

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రేరణతో, “వికసిత్ భారత్” కల సాకారం చేయడంలో తన వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.