



శ్రీకాకుళం రూరల్ మండలంలోని సింగుపురం పంచాయతీ కరజాడ గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన అన్నసమారాధనలో పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహక కమిటీ సభ్యులు, గ్రామ దేవాలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పూజారి అనంత్ శర్మ మాట్లాడుతూ — “ప్రతీ ఏటా అన్నప్రసాద పంపిణీ నిర్వహిస్తూ గణపతి ఉత్సవాలను వైభవంగా జరుపుతున్నాము. ఈ సంవత్సరం గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో మరింత ఘనంగా నిర్వహించగలిగాము” అని పేర్కొన్నారు.కరజాడ గ్రామస్థులు మాత్రమే కాకుండా మండల పరిధిలోని పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. గణనాథుడి ఆశీస్సులు అందుకున్నామని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

