Saturday, 19 July 2025
  • Home  
  • కమ్యూనిస్టుదే సంపూర్ణ స్వాతంత్ర నినాదం
- Featured

కమ్యూనిస్టుదే సంపూర్ణ స్వాతంత్ర నినాదం

 ప్రపంచానికి కమ్యూనిజమే ప్రత్యామ్నాయ : కమ్యూనిస్టు పార్టీమండల కార్యదర్శి దేవదానం మనుబోలు (పున్నమి విలేఖరి)17, అక్టోబర్ :భారత కమ్యూనిస్టు ఉద్యమ శత వార్షికోత్సవాల కార్యక్రమాన్ని మనుబోలు మండల సిపిఎం కార్యాలయంలో శనివారం నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి దేవదానం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో మార్క్సిస్టు, లెనిస్టు సిద్ధాంతాలకు అంకితం అయిన కమ్యూనిస్టుపార్టీ 100 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందన్నారు.ఆనాటి నుండి నేటి వరకు రైతాంగం, మహిళలు, గిరిజనులు, దళితుల కోసం కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఎన్నో జమీందారి వ్యతిరేక, రైతాంగం ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు నిర్వహించారని, జాతీయోద్యమంలోనూ కమ్యూనిస్టులు ఉద్యమించారని, ఆ పోరాటాల పర్యవసానంగానే రైతులకు, మహిళలకు కొన్ని హక్కులు వచ్చాయన్నారు. పోరాటాల ఫలితంగా వచ్చిన హక్కులు నేటి బిజెపి పాలనలో ప్రమాదంలో పడ్డాయని అన్నారు. పార్లమెంటులో కార్పొరేట్‌ వ్యవసాయానికి అనుకూలంగా మూడు చట్టాలను బిజెపి ప్రభుత్వం చేసిందని తెలిపారు. కార్మికుల హక్కులను ప్రమాదంలోకి నెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. కమ్యూనిస్టు ఆశయాలను సాధించేందుకు కమ్యూనిస్టులంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఆదిశేషయ్య, సిపిఎం నాయకులు మోహన్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు


 ప్రపంచానికి కమ్యూనిజమే ప్రత్యామ్నాయ : కమ్యూనిస్టు పార్టీమండల కార్యదర్శి దేవదానం మనుబోలు (పున్నమి విలేఖరి)17, అక్టోబర్ :భారత కమ్యూనిస్టు ఉద్యమ శత వార్షికోత్సవాల కార్యక్రమాన్ని మనుబోలు మండల సిపిఎం కార్యాలయంలో శనివారం నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి దేవదానం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో మార్క్సిస్టు, లెనిస్టు సిద్ధాంతాలకు అంకితం అయిన కమ్యూనిస్టుపార్టీ 100 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందన్నారు.ఆనాటి నుండి నేటి వరకు రైతాంగం, మహిళలు, గిరిజనులు, దళితుల కోసం కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఎన్నో జమీందారి వ్యతిరేక, రైతాంగం ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు నిర్వహించారని, జాతీయోద్యమంలోనూ కమ్యూనిస్టులు ఉద్యమించారని, ఆ పోరాటాల పర్యవసానంగానే రైతులకు, మహిళలకు కొన్ని హక్కులు వచ్చాయన్నారు. పోరాటాల ఫలితంగా వచ్చిన హక్కులు నేటి బిజెపి పాలనలో ప్రమాదంలో పడ్డాయని అన్నారు.
పార్లమెంటులో కార్పొరేట్‌ వ్యవసాయానికి అనుకూలంగా మూడు చట్టాలను బిజెపి ప్రభుత్వం చేసిందని తెలిపారు. కార్మికుల హక్కులను ప్రమాదంలోకి నెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు.
కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. కమ్యూనిస్టు ఆశయాలను సాధించేందుకు కమ్యూనిస్టులంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఆదిశేషయ్య, సిపిఎం నాయకులు మోహన్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.