పిల్లల్లో సెల్ ఫోన్ వ్యసనం హత్యలకు దారితీసే ప్రమాదాలు, కారణాలు.
సహస్ర హత్య కేసే సాక్ష్యం. స్పందనే ఈ కథ.
ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి @
ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు సెల్ ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలు మారాం చేయకుండా ఉండాలంటే అనే ఉద్దేశంతో, తినడం లేదని, ఏడుస్తున్నారని… వారి చేతికి ఫోన్లు అప్పగిస్తున్నారు. కానీ ఇది భవిష్యత్తులో వాళ్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేసే ప్రమాదానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మూల కారణం ఎవరు.?
పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలవ్వడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులే. బిజీ లైఫ్ స్టైల్స్ కారణంగా పిల్లలకు సరైన సమయం కేటాయించాలి అన్న బాధ్యతను బావిలో పడవేసి, తమ కొడుకులకు కూతుళ్లకు ఫోన్ ఇచ్చి తమ పని చూసుకుంటున్నారు. పిల్లలు మారాం చేసినప్పుడు ఫోన్ ఇవ్వడం, తినడం కోసం ఫోన్ అవసరం అనుకోవడం తల్లిదండ్రుల్లో పెరిగిన అభ్యాసం. అయినప్పటికీ, ఈ అలవాటు వ్యసనంగా మారిపోతూ, పిల్లల్లో ఆందోళన, నిరాశ, ఆగ్రహం పెరగడానికి దారితీస్తుంది.
సెల్ ఫోను కారణంగా వచ్చే ప్రమాదాలు:
శారీరక సమస్యలు, కంటి చూపు తగ్గడం, వెన్ను సంబంధిత సమస్యలు, ఒబెసిటీ,
మానసిక సమస్యలు, డిప్రెషన్, ఒత్తిడి, అగ్రెషన్, సోషల్ ఐసోలేషన్,
చదువుపై దుష్ప్రభావం, సోషలైజేషన్ పూర్తిగా దెబ్బతింటుంది. హత్య, ఆత్మహత్యలకు దారితీసే గంభీర పరిస్థితులు వయసు పెరిగే కొద్దీ వీడియోలు, ఆటలు, పోర్న్, బెట్టింగ్, బుల్లీయింగ్ వంటి డిజిటల్ డేంజర్ వల్ల పిల్లలు నేరాలకు పాల్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
మార్చుకోవాల్సిన తల్లిదండ్రుల బాధ్యత.!
పిల్లలకు ఫోన్ల ఉద్దేశపూర్వక వినియోగం గురించి చెప్పాలి,డిజిటల్ ఎక్స్పోజర్ టైం తగ్గించాలి, వారితో సమయం గడపాలి, ఆటలకి ప్రోత్సహించాలి, ఇంట్లో చిన్న పనుల్లో భాగం చేయాలి, తల్లిదండ్రులు స్వయంగా ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి. లేకపోతే పిల్లల్ని కన్నందుకు అనేక బాధల్ని చవిచూడాల్సి వస్తుంది.
పిల్లలు సెల్ ఫోన్లు వినియోగించకూడదని సామాజిక ఉద్యమానికి తెర తీయాలి.
పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10% మాత్రమే కారకులు.!
కానీ 90% కారకులు తల్లిదండ్రులే..! అది ఎలాగో తెలుసుకుందాం…. పిల్లల్ని గారాబం మరీ శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది.పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, వారిని నాశనం చేస్తున్నారు.!
ఇప్పుటి తరం 70% పిల్లలు..తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు.మంచి నీళ్ళు, పాలు,కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు.లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు.కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు. రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవమంటే లేవరు.గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు.
తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర్మంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని
పిల్లలు సెల్ ఫోన్లు వినియోగించకూడదని సామాజిక ఉద్యమానికి తెర తీయాలి.
సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు.
హత్య జరిగిన రోజే.. నిందితుడిని ముందే అనుమానించిన తల్లి.! వర్తన చూసి ప్రశ్నిస్తే.. దబాయించిన బాలుడు క్రైమ్ వెబ్‌సిరీస్‌లు చూసి తప్పటడుగులు.ఎవరైనా తోటి పిల్లల వస్తువులపై మనసు పడితే తనకూ కొనివ్వాలని తల్లిదండ్రులను పోరుపెడతారు..అతను మాత్రం ఇంట్లోకి చొరబడి ఎలా కొట్టేయాలో ప్లాన్ రాసుకున్నాడు. పిల్లలు తప్పు చేస్తూ దొరికిపోతే భయంతో పారిపోతారు.. అతను మాత్రం హత్య వరకూ వెళ్లాడు. ఇలాంటి నేరం చేస్తే ఎవరైనా భయపడిపోతారు.. అతను మాత్రం ఏ జంకూ లేకుండా ఆధారాలు మాయం చేయడానికి ప్రయత్నించాడు. పక్కింట్లో బాలికను చంపేసి కూడా బాధపడని అతడు.. అదేరోజు తన పెంపుడు కుందేలు చనిపోతే మాత్రం దిగాలు పడ్డాడు. అనుమానంతో ప్రశ్నించిన తల్లినీ మాయమాటలతో బురిడీ కొట్టించాడు. కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడు పదో తరగతి విద్యార్థి ప్రవర్తన ఇది. విచారణలో అతడు వెల్లడించిన విషయాలకు పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సీపీ అవినాశ్ మహంతి శనివారం మీడియాకు వెల్లడించారు.
కళ్లు మూసుకొని కత్తితో పొడిచి.
సెలవు రోజుల్లో గల్లీలో పిల్లలందరూ కలిసి క్రికెట్ ఆడేవారు. కొన్ని రోజుల క్రితం సహస్ర తమ్ముడి బ్యాట్ నచ్చిన నిందితుడు తానొకసారి ఆడి ఇస్తానని అడగ్గా.. అతడు అంగీకరించలేదు. దీంతో ఎలాగైనా దాన్ని కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. వారి అపార్ట్‌మెంట్ల మధ్య కేవలం 2 అడుగుల దూరం మాత్రమే ఉండటంతో రెండుసార్లు గోడదూకి వెళ్లి పరిశీలించాడు. ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లినా తలుపులు తీసి లోపలకు వెళ్లే అవకాశం ఉందని గ్రహించాడు. ఓటీటీలో క్రైమ్ వెబ్‌సిరీస్‌లు, యూట్యూబ్‌లో సీఐడీ సీరియల్స్ చూసిన అనుభవంతో దొంగతనానికి పథకం రాసుకున్నాడు. ఎవరైనా అడ్డొస్తే భయపెట్టాలని వంటగదిలోని కత్తి తీసుకొని బయలుదేరాడు.కానీ, ఇంట్లో ఎవరూ ఉండరనకుంటే సహస్ర కనిపించడంతో కాసేపు ఆలోచించాడు. ఆమె టీవీ చూస్తుండటంతో గుట్టుగా వెళ్లి బ్యాట్ తీసుకొని బయలుదేరాడు. ఈలోపు బాలిక గమనించి దొంగదొంగ అంటూ కేకలు వేస్తూ.. ఇంటి గుమ్మం వద్ద అతని చొక్కా పట్టుకొని వెనక్కి లాగింది. మీ డాడీకి చెబుతానంటూ బెదిరించింది. దీంతో భయపడిన బాలుడు కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు. మెడపై తీవ్రగాయం కావటంతో బాలిక నిర్జీవంగా పడిపోయింది. తరువాత బాలుడు కత్తిని అక్కడే నీళ్లతో కడుక్కొని, బ్యాట్ తీసుకొని తన ఇంటికి వచ్చాడు. ఇంత చిన్న వయసులోనే కరుడుగట్టిన అంతకుడిగా మారిపోయాడు, మీ పిల్లలు కూడా ఇలా మారకుండా ఉండాలంటే మీరే మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులారా గమనించండి మేల్కొనండి జాగ్రత్త పడండి మీ పిల్లల్ని మీరు రక్షించుకోకపోతే ఎప్పటికైనా ప్రమాదం మీ కడుపు నుండే పుట్టింది అవుతుంది.
ఇక కొందరు ఆడ పిల్లల ప్రవర్తన మహా డేంజర్ గా ఉంది.
కొందరు ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి. అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు.20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు.బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి. కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు.వారిస్తే వెర్రి పనులు. దీంతో తల్లిదండ్రులు మదనతో ఏం చెప్పలేకపోవడం గమనర్హం.మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,కానీ కారణం మనమే..ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి.చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం.
గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు.
సోమరి పోతుల్లా తయారు కావడానికి తల్లిదండ్రులే కారణం.!
వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది
కష్టం గురించి తెలిసేలా పెంచండి.
కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు.ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.మరికొంతమంది సోమరిపోతుల్లా తయారు అవుతున్నారు.
పెద్దలు కనిపిస్తే నమస్కరించే పద్ధతులు కూడా కొన్ని ప్రాంతాల్లో కనుమరుగవుతున్నాయి. అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు.ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
గుడ్, బయటి ఫుడ్, మీకు అనారోగ్యం, హాస్పిటల్లో బెడ్,
ప్రస్తుత ఈ కాలంలో 50% నేటి యువత బయటి ఫుడ్ కు అలవాటు పడి, బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు. దీనివల్ల వారి మానసిక రుగ్మతలు పెరిగిపోయి వారు ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల శారీరక మానసిక సంఘటనలు అనుభవించాల్సి వస్తుంది. ఇలా యువతలో మార్పులు రావడం చూసి తల్లిదండ్రులు తల్లడిపోతున్నారు అయ్యో నా బాబు నా కూతురు ఇలా అయిపోతుంది ఏమిటి.? అని అయోమయానికి గురవుతున్నారు. దీంతో వారికి గారాబం చేస్తున్నారు మా తల్లిదండ్రులు అనే ఒక వీక్ పాయింట్ వారికి అర్థం కావడం వల్ల వారు మరింతగా బయటి ఫుడ్డుకు అలవాటు పడి వారి జీవితాన్ని వారే సర్వనాశనం చేసుకుంటున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
పిల్లల్లో కలుగుతున్న ఈ విపత్తును తుంచి వేయకపోతే మరింత ప్రమాదం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
గతంలో నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యలు వస్తున్నారంటే పిల్లలకు ఒక పండగ వాతావరణం కనిపించేది. మారుతున్న ఈ కాలంలో ఆ బంధాలు తెగిపోయాయి, నాడు పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాజా తాజాగా పళ్ళు ఫలాలు కూరగాయలు ఆకుకూరలు ఎన్నో లభించేవి అవి తిన్నవారు ఆయురారోగ్యాలతో ఉండడంతో పాటు మనిషి మనుగడ జీవితం శాంతం భద్రం మనం ఎలా చదవాలి ఎలా ఎదగాలి అని ఒక నైపుణ్యత పిల్లల్లో సుస్థిర స్థానం ఇమిడిపోయి ఉండేది, కాలం మారిపోయింది దీంతో..కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం.కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్.చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు. దీంతో మానసిక ఎదుగుదల క్షీణించిపోయి ఎంత చదివినా కానీ వారి మెదడుకు ఎక్కక దీనితో పాటు సెల్ ఫోన్లు వాడడంతో వారు ఎంత చదివినా గాని వారి దృష్టి అంతా మొబైల్ లోనే ఉండడం వల్ల వాళ్ళు చదువుకోలేక పోవడం క్రైమ్ మద్యం అంబార్ గుట్కా గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. అనుక్షణం వీరు తల్లిదండ్రులు నిఘా పెట్టి అరికట్టకపోతే కన్న పిల్లలే శత్రువుగా మారి తల్లిదండ్రులను హతమార్చే రోజులు దాపురించాయి. పిల్లల్లో కలుగుతున్న ఈ విపత్తును తుంచి వేయకపోతే మరింత ప్రమాదం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
తల్లిదండ్రులు మారాలి,రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం.? ఒక్కసారి ఆలోచన చేయండి..
ప్రతి తల్లి తండ్రి కొడుకో బిడ్డో పుట్టగానే చాలా సంతోషిస్తారు కడుపు కట్టుకొని పిల్లలు పుట్టారని మరికొంత కష్టం చేసి నాలుగు రూపాయలు వెనుకేసే కోసం శ్రమిస్తుంటారు. పిల్లల ఆలన పాలన చూసి స్కూల్లకు పంపి వారి ఎదుగుదలకు తల్లితండ్రులు వేల కట్టలేని సేవలు చేస్తుంటారు. పిల్లలకు ఏదైనా జరగరానిది జరిగితే ఆ తల్లి తండ్రుల బాధ వర్ణనాతీతం. ఆ బాధలను ఏ భగవంతుడు కూడా తీర్చలేడు. ఆ తల్లి తండ్రులు బ్రతికున్నంత వరకు వారిని ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఇది తెలియని కొందరు పిల్లలు తల్లితండ్రుల మాట వినక వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు.
వీటన్నికి కారణం మనం, మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..!అందుకే తల్లిదండ్రులు మారాలి,రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం…? ఒక్కసారి ఆలోచన చేయండి.
సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు.
సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి…?
కేవలం గుడికి వెళ్లి…పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు.
పిల్లలకు బాధ్యత మర్యాద గౌరవం కష్టం నష్టం ఓర్పు సహనం దాతృత్వం ప్రేమ
అనురాగం సహాయం సహకారం
నాయకత్వం మానసిక ద్రృఢత్వం కుటుంబ బంధాలు. అనుబంధాలు దైవ భక్తి దేశ భక్తి
ఈ భావనలు…సంప్రదాయాలు అంటే..!
కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి.
మంది కోసం బ్రతకొద్దు.! మన ఆరోగ్యం, ఆనందం కోసం న్యాయంగా బ్రతుకుదాం.ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం.పూర్తిగా చదివినందుకు పున్నమి దినపత్రిక తరఫున ధన్యవాదములు.
ఈ స్టోరీ మీకు నచ్చితే ఇతరులకు పంపండి ఈ వార్త సమాజానికి చాలా అవసరం


