త్రాగు నీటి సమస్య పరిష్కరించాలి
సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిగి చెన్నయ్య
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 4 (పున్నమి న్యూస్ ప్రతినిధి – సింగమాల వెంకటేష్ ) రైల్వే కోడూరు
మండల పరిధిలోని కన్నె గుంట ఎస్టి కాలనీ లో తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సిగి చెన్నయ్య సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. మంగళవారం, కన్నెగుంటలోని స్థానికులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ దాదాపు 250. కుటుంబాలు వారు నివాసం ఉన్నారన్నారని, త్రాగునీటి సదుపాయానికి కేవలం ఒకే ఒక బోరింగ్ మాత్రమే ఉందన్నారు, ఈ ఒక్క బోరింగ్ మీద ఆధారపడి 200 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. తక్షణమే అధికారులు వెంటనే స్పందించి, ఈ కాలనీకి నీటి బోరు వేసి త్రాగునీటిని ఏర్పాటు చేయాలని, కాలనీలో మౌళిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా, బ్రతుకులు మారలేదని స్థానికులు వాపోతున్నారు అని ఆయన అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ నాయకులు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు


