పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 నాగర్ కర్నూల్ జిల్లా
తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు కనీస వేతనం 26,000 చెల్లించాలని ఉద్యోగ భద్రత ఈఎస్ఐపిఎఫ్ తదితర సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య డిమాండ్ చేశారు.
ఈ రోజు కోడేరు మండల కేంద్రంలో జరిగిన ఆశ వర్కర్స్ యూనియన్ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ నూతన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి రెండు సంవత్సరాలు కావస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోగా ఆశ కార్యకర్తలపై నిర్బంధాలు పెరిగాయని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు.. పైగా ఆశ వర్కర్లు పనిచేయడం లేదని ప్రభుత్వం చెప్పడం సరైన మాట కాదని ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు కాబట్టే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ఆశ వర్కర్లను గుర్తించిందని అలాంటి సంస్థ గుర్తించిన ప్రభుత్వ మాత్రం పనిచేయడం లేదని చెప్పడం సరి అయిన పద్ధతి కాదని ఆయన అన్నారు.. మరొకవైపు ప్రక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లిస్తూ 1,50,000 గ్రాటిటి అమలు చేస్తూ 180 రోజుల ప్రసూతి సెలవులు ప్రకటించిన అక్కడి ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం ఆశాల సమస్యలు ఎందుకు పరిష్కారం చేయదని ఆయన ప్రశ్నించారు.. లక్షల కొద్ది రూపాయల జీతాలతో మరొకరు అతి తక్కువ వేతనాలతో కార్మికులు పనిచేస్తున్నారని ఇలాంటి అసమానతలు కొనసాగుతున్న ముఖ్యమంత్రి మాత్రం సమాజంలో అసమానతలు పోవాలని చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.. అందులో భాగంగా ఆశ వర్కర్లకి ఇవ్వాల్సిన లెప్రసి ఎలక్షన్స్ డ్యూటీ డబ్బులు ఆరు నెలల కరోనా రిస్క్ అలవెన్స్ ఇదేమి చెల్లించకుండా పెండింగ్లో ఉంచుకున్నారని ఆయన అన్నారు.. ఇప్పటికైనా తెలంగాణ నూతన ప్రజా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దశరథం ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళావతి జిల్లా కమిటీ సభ్యులు రత్నమాల నాయకురాలు నీలమ్మ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ ఆశ వర్కర్స్ యూనియన్ ఆశ వర్కర్స్ రాణి జ్యోతి సుకన్య పల్లవి జయమ్మ వరలక్ష్మి శశికళ కృష్ణవేణి అంచలమ్మ మంగమ్మ సంతోషి రాములమ్మ కమల రాధా సునీత ఎల్లమ్మ కల్పన తదితరులు పాల్గొన్నారు.

కనీస వేతనం 26,000 చెల్లించాలి… సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు కనీస వేతనం 26,000 చెల్లించాలని ఉద్యోగ భద్రత ఈఎస్ఐపిఎఫ్ తదితర సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య డిమాండ్ చేశారు. ఈ రోజు కోడేరు మండల కేంద్రంలో జరిగిన ఆశ వర్కర్స్ యూనియన్ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ నూతన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి రెండు సంవత్సరాలు కావస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోగా ఆశ కార్యకర్తలపై నిర్బంధాలు పెరిగాయని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు.. పైగా ఆశ వర్కర్లు పనిచేయడం లేదని ప్రభుత్వం చెప్పడం సరైన మాట కాదని ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు కాబట్టే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ఆశ వర్కర్లను గుర్తించిందని అలాంటి సంస్థ గుర్తించిన ప్రభుత్వ మాత్రం పనిచేయడం లేదని చెప్పడం సరి అయిన పద్ధతి కాదని ఆయన అన్నారు.. మరొకవైపు ప్రక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లిస్తూ 1,50,000 గ్రాటిటి అమలు చేస్తూ 180 రోజుల ప్రసూతి సెలవులు ప్రకటించిన అక్కడి ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం ఆశాల సమస్యలు ఎందుకు పరిష్కారం చేయదని ఆయన ప్రశ్నించారు.. లక్షల కొద్ది రూపాయల జీతాలతో మరొకరు అతి తక్కువ వేతనాలతో కార్మికులు పనిచేస్తున్నారని ఇలాంటి అసమానతలు కొనసాగుతున్న ముఖ్యమంత్రి మాత్రం సమాజంలో అసమానతలు పోవాలని చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.. అందులో భాగంగా ఆశ వర్కర్లకి ఇవ్వాల్సిన లెప్రసి ఎలక్షన్స్ డ్యూటీ డబ్బులు ఆరు నెలల కరోనా రిస్క్ అలవెన్స్ ఇదేమి చెల్లించకుండా పెండింగ్లో ఉంచుకున్నారని ఆయన అన్నారు.. ఇప్పటికైనా తెలంగాణ నూతన ప్రజా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దశరథం ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళావతి జిల్లా కమిటీ సభ్యులు రత్నమాల నాయకురాలు నీలమ్మ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ ఆశ వర్కర్స్ యూనియన్ ఆశ వర్కర్స్ రాణి జ్యోతి సుకన్య పల్లవి జయమ్మ వరలక్ష్మి శశికళ కృష్ణవేణి అంచలమ్మ మంగమ్మ సంతోషి రాములమ్మ కమల రాధా సునీత ఎల్లమ్మ కల్పన తదితరులు పాల్గొన్నారు.

