కనక మహాలక్ష్మి అమ్మవారి దీవెనలు నగర ప్రజలపై ఉండాలి
– నగర మేయర్ పీలా శ్రీనివాసరావు.
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు నగర ప్రజలపై ఉండాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన 4 వ జోన్ లో ఉన్న శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని నగర మేయర్ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు నగర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి ఆయురారోగ్యాలు చేకూరుతాయని తెలిపారు. నేడు అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు.
ఆలయ అధికారులు మేయర్ దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు.


