Thursday, 12 February 2026
  • Home  
  • కడు పేదరిక ప్రజల కోసం నిరంతరం శ్రమించే ప్రత్యక్ష దైవ స్వరూపం – పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి
- ఆంధ్రప్రదేశ్

కడు పేదరిక ప్రజల కోసం నిరంతరం శ్రమించే ప్రత్యక్ష దైవ స్వరూపం – పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి

చిట్వేల్, అక్టోబర్ 3: (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం పాపిరెడ్డిపల్లె సమీపం అప్పారావు సర్కిల్‌లోని జీవనజ్యోతి ఆశ్రమం చైర్మన్ పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. చిట్వేల్‌కు చెందిన చేతులులేని దివ్యాంగులు మల్లికా, కార్తీక్‌కు జీవన పెన్షన్ అందజేశారు. కడుపేదరికంతో పెన్షన్ పొందలేని వారికి ప్రభుత్వ మంజూరు వరకు స్వయంగా సహాయం చేయడం తన ధర్మమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయన సేవలను ప్రశంసిస్తూ, దేవుడి రూపంగా చూస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో దట్టం రఘురామయ్య, కోవూరి సావిత్రి, జెట్టి సుబ్రహ్మణ్యం, పాణ్యం లోకేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మానవసేవే మాధవసేవ అన్న నినాదంతో ఆయన నిరుపేదలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

చిట్వేల్, అక్టోబర్ 3: (పున్నమి ప్రతినిధి)

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం పాపిరెడ్డిపల్లె సమీపం అప్పారావు సర్కిల్‌లోని జీవనజ్యోతి ఆశ్రమం చైర్మన్ పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. చిట్వేల్‌కు చెందిన చేతులులేని దివ్యాంగులు మల్లికా, కార్తీక్‌కు జీవన పెన్షన్ అందజేశారు. కడుపేదరికంతో పెన్షన్ పొందలేని వారికి ప్రభుత్వ మంజూరు వరకు స్వయంగా సహాయం చేయడం తన ధర్మమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయన సేవలను ప్రశంసిస్తూ, దేవుడి రూపంగా చూస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో దట్టం రఘురామయ్య, కోవూరి సావిత్రి, జెట్టి సుబ్రహ్మణ్యం, పాణ్యం లోకేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మానవసేవే మాధవసేవ అన్న నినాదంతో ఆయన నిరుపేదలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.