తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి)
తాడేపల్లిగూడెం మండలం కడిగడ్డలో శ్రీ బాలా త్రిపుర సుందరి దసరా ఉత్సవ పీఠం వద్ద సోమవారం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలతో మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఈ పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని లలితా సహస్ర పారాయణం, భగవద్గీత చేశారు. నవరాత్రులు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.


