Thursday, 19 March 2026
  • Home  
  • కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ లో ఉగాది పండుగ వేడుకలు ప్రజలకు చేరవవున్న పోలీసులు💐
- కడప

కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ లో ఉగాది పండుగ వేడుకలు ప్రజలకు చేరవవున్న పోలీసులు💐

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు ఇవాళ పండుగ సందర్బంగా ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. నిత్యం ఖాకీ దుస్తుల్లో కనిపించే పోలీసులు, ఈరోజు సంప్రదాయ దుస్తుల్లో విధులకు హాజరై పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించారు. సబ్ డివిజన్ పోలీసు అధికారులు మరియు సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రొద్దటూర్ ఏఎస్పీ శ్రీ విభూకృష్ణ ఐపీఎస్ గారిని కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ వాతావరణం లో పోలీసు అధికారులు మరియు సిబ్బంది తో కలిసి ఏఎస్పీ గారు స్వీట్లు మరియు ఉగాది పచ్చడి ఆరగించి,పోలీసు అధికారు లందరిని మరియు సిబ్బంది ని ఆప్యాయంగా పలుకరించి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ విభూ కృష్ణ ,ఐపీఎస్ గారు మాట్లాడుతూ పోలీసు లు కూడా ప్రజల్లో నుండి వచ్చినవారే నని,ప్రజలకు, పోలీసులు అంటే ఉన్న భయం తొలగిపోవాలని,తమ సమస్యలను ధైర్యంగా మరియు స్వేచ్ఛగా తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ కొండారెడ్డి,టూ టౌన్ సిఐ వంశీనాథ్ ,రూరల్ సిఐ నాగభూషణ్ మరియు సబ్ డివిజన్ ఎస్సై లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు ఇవాళ పండుగ సందర్బంగా ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి.

నిత్యం ఖాకీ దుస్తుల్లో కనిపించే పోలీసులు, ఈరోజు సంప్రదాయ దుస్తుల్లో విధులకు హాజరై పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించారు. సబ్ డివిజన్ పోలీసు అధికారులు మరియు సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రొద్దటూర్ ఏఎస్పీ శ్రీ విభూకృష్ణ ఐపీఎస్ గారిని కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ వాతావరణం లో పోలీసు అధికారులు మరియు సిబ్బంది తో కలిసి ఏఎస్పీ గారు స్వీట్లు మరియు ఉగాది పచ్చడి ఆరగించి,పోలీసు అధికారు లందరిని మరియు సిబ్బంది ని ఆప్యాయంగా పలుకరించి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ విభూ కృష్ణ ,ఐపీఎస్ గారు మాట్లాడుతూ పోలీసు లు కూడా ప్రజల్లో నుండి వచ్చినవారే నని,ప్రజలకు, పోలీసులు అంటే ఉన్న భయం తొలగిపోవాలని,తమ సమస్యలను ధైర్యంగా మరియు స్వేచ్ఛగా తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ కొండారెడ్డి,టూ టౌన్ సిఐ వంశీనాథ్ ,రూరల్ సిఐ నాగభూషణ్ మరియు సబ్ డివిజన్ ఎస్సై లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.