మర్రిపాడు: డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
మర్రిపాడు మండలం కంపసముద్రం ఉన్నత పాఠశాలకు గ్రామానికి చెందిన ధాత గోపవరం కాంతారెడ్డి ఒక కంప్యూటర్ మరియు ప్రింటర్ ను బహూకరించారు.ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు పాఠశాల అవసరాలను గుర్తించి సహాయ సహకారాలను అందజేయడం అభినందనీయమని అన్నారు.అనంతరం పాఠశాల సిబ్బంది ధాతను ఘనంగా సత్కరించి పాఠశాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేశారు.


