తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ శ్రీ కందుల గుండయ్య నాయుడు గారి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ శ్రీ కె.కె. చౌదరి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు.
బుధవారం ఉదయం చిట్వేలి మండలంలోని కె. కందులవారిపల్లిలో కందుల గుండయ్య నాయుడు గారి అంతిమ యాత్రకు ముందు, చైర్మన్ కె.కె. చౌదరి ఆయన భౌతికకాయానికి టీడీపీ జెండాను కప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి, ప్రజలకు కందుల గుండయ్య నాయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ నివాళి కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కస్తూరి విశ్వనాథ నాయుడు, చిట్వేలి మాజీ ఎం.పీ.పి కట్టా గుండయ్య నాయుడుతో పాటు చిట్వేలి మండలంలోని పలువురు టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నాయకులు అంతా కలిసి దివంగత నాయకుడికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కందుల గుండయ్య నాయుడు బౌతికాయానికి టీడీపీ జెండా కప్పి నివాళులర్పించిన కె.కె. చౌదరి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ శ్రీ కందుల గుండయ్య నాయుడు గారి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ శ్రీ కె.కె. చౌదరి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. బుధవారం ఉదయం చిట్వేలి మండలంలోని కె. కందులవారిపల్లిలో కందుల గుండయ్య నాయుడు గారి అంతిమ యాత్రకు ముందు, చైర్మన్ కె.కె. చౌదరి ఆయన భౌతికకాయానికి టీడీపీ జెండాను కప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి, ప్రజలకు కందుల గుండయ్య నాయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ నివాళి కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కస్తూరి విశ్వనాథ నాయుడు, చిట్వేలి మాజీ ఎం.పీ.పి కట్టా గుండయ్య నాయుడుతో పాటు చిట్వేలి మండలంలోని పలువురు టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నాయకులు అంతా కలిసి దివంగత నాయకుడికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

