కందుకూరు ఘటన విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించినందుకు రాధారంగా రాయల్ అసోసియేషన్ నేత గాదే బాలాజీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా అక్కయ్యపాలెం హైవే లో ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకురాలు ఉషాకిరణ్, రాధా రంగా రాయల్ అసోసియేషన్ ప్రతినిధి బొగ్గు
శ్రీను ఇతర ప్రతినిధులతో కలిసి గాదె బాలాజీ మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం కందుకూరు ఘటనలో బాధిత కుటుంబాలకు స్పష్టమైన భరోసా ఇవ్వడం పట్ల హర్షం వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, పురపాలక మంత్రి నారాయణ, జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ను కలిసి ఘటనా స్థలానికి పంపించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిస్వార్ధంగా ప్రజాసేవ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వైసీపీ నేతలు కందుకూరి ఘటనను కులానికి ఆపాదించి కులం మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బాధితులకు స్పష్టమైన హామీని ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని గాదె బాలాజీ మండిపడ్డారు. మీడియా సమావేశంలో రాధా రంగా రాయల్ అసోసియేషన్ నేతలు, జనసేన నాయకులు,రంగా అభిమానులు పాల్గొన్నారు.

కందుకూరు బాధితులకు ప్రభుత్వ భరోస హర్షనీయం.. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాపు నేతలు చంద్రబాబు కు రాధారంగా రాయల్ అసోసియేషన్ కృతజ్ఞతలు
కందుకూరు ఘటన విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించినందుకు రాధారంగా రాయల్ అసోసియేషన్ నేత గాదే బాలాజీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా అక్కయ్యపాలెం హైవే లో ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకురాలు ఉషాకిరణ్, రాధా రంగా రాయల్ అసోసియేషన్ ప్రతినిధి బొగ్గు శ్రీను ఇతర ప్రతినిధులతో కలిసి గాదె బాలాజీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కందుకూరు ఘటనలో బాధిత కుటుంబాలకు స్పష్టమైన భరోసా ఇవ్వడం పట్ల హర్షం వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, పురపాలక మంత్రి నారాయణ, జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ను కలిసి ఘటనా స్థలానికి పంపించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిస్వార్ధంగా ప్రజాసేవ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వైసీపీ నేతలు కందుకూరి ఘటనను కులానికి ఆపాదించి కులం మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బాధితులకు స్పష్టమైన హామీని ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని గాదె బాలాజీ మండిపడ్డారు. మీడియా సమావేశంలో రాధా రంగా రాయల్ అసోసియేషన్ నేతలు, జనసేన నాయకులు,రంగా అభిమానులు పాల్గొన్నారు.

