సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ము,నుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,అక్టోబర్15,
(పున్నమి ప్రతినిధి):
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని జయ శ్రీ ఫంక్షన్ హాల్ లో సివియర్ డిసబిలిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన కర్నాటి స్వప్న – అనిల్ దంపతుల,సహకారంతోని చౌటుప్పల్ చుట్టూరా ఉన్న 50 మంది కండరాల క్షీణత,వెన్నుముక మరియు తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఒక్కొక్కరికి 2000 రూపాయలు విలువచేసే నిత్యవసర సరుకులను ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక తహసిల్దార్ మీరాబాయి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు బాలకృష్ణ కత్తుల మాట్లాడుతూ.. బాధితుల సమస్యలు వివరిస్తూ నిత్య నరకయాతన ఒకరి మీద ఆధారపడి జీవించే జీవనశైలి ఒకరి సహకారం లేనిది కాలు చేయి కూడా కదపలేని పరిస్థితి సొంతంగా ఏ పని చేయలేరని వివరించారు.ఈ నిత్యవసర సరుకులతో దీపావళి పండుగ ముందే వచ్చిందని దివ్యాంగులు సంబరపడ్డారు.జీవితంపై భరోసా కల్పించిన మనసున్న దాతకు కృతజ్ఞత తెలిపారు.అలాగే తహసిల్దార్ కు కొంత స్థలం బాధితుల కోసం కేటాయించాలని వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా తహసిల్దార్ మీరాబాయి మాట్లాడుతూ… ధైర్యంగా ఉండండి.అధైర్య పడొద్దు,చదువుకునే వాళ్లు ఇంకా బాగా చదవండి చదివే మనకు మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది వారు కోరినట్టుగా స్థలం ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో దివ్యాంగులు,కోఆర్డినేటర్ మహేష్త,దితరులు, పాల్గొన్నారు.


