కంటోన్మెంట్ జోన్ గా అయినవిల్లి..

    0
    172

    తూర్పుగోదావరిజిల్లా : శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం, అయినవిల్లి,

    ప్రభుత్వ ఉత్తర్వులు మరియు గైడ్ లైన్స్ అనుసరించి 8 వ తేదీ నుండి స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఆలయ ఈ. ఓ తెలిపారు.కానీ తాజాగా అయినవిల్లి మండలంలో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అయినవిల్లి కూడా కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించినందున శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ది.08-06-2020 తేది నుండి భక్తులు దర్శనములను ఉన్నతాధికార్లు అనుమతి ఉత్తర్వులు వచ్చు వరకు నిలుపుదల చేయడమైనదని, భక్తులకు దర్శనములు తేదీని తదుపరి ప్రకటన ద్వారా తెలియపరచుట జరుగుతుందని , శ్రీ స్వామి వారికి జరుగు సేవలు, దూప, దీప నైవేద్యములు యధాప్రకారము గా ఏకాంతముగా అర్చకులు వారిచే జరుగుతాయని ఆలయ ఈఓ తెలిపారు. శ్రీ స్వామి వారికి పూజాది కార్యక్రమాలు జరిపించుకొనుటకు దేవస్థానము వారు ఆన్ లైన్ సేవలు అందుబాటులో (www.svstemple.com) ఉంచామని ఈఓ. తారకేస్వరారావు తెలిపారు.

    0
    0