పున్నమి తెలుగు దిన పత్రిక ✍️
నెల్లూరు జిల్లా కేంద్రంతో ఇతర ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్స్ దుకాణాలు తీసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతి జారీ చేస్తునట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మాత్రం 6 నుంచి 9 వరకు మాత్రమే అనుమతి జారీ చేస్తున్నామన్నారు.

