కంటేపల్లిలో రైతు శిక్షణా కార్యక్రమం
వెంకటాచలం, ఫిబ్రవరి 2 (పున్నమి విలేఖరి):
మండలంలోని కంటేపల్లిలో మంగళవారం రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు హైమావతి, వ్యవసాయ అధికారి శిరీష, నెల్లూరు రూరల్ సహాయ వ్యవసాయ సంచాలకులు బాలాజీ నాయక్, డాట్ సెంటర్ సైంటిస్ట్ శ్వేత హాజరయ్యారు. వరిలో వచ్చే తెగుళ్లు, పురుగులు, వాటి నియంత్రణకు తీసుకోవలసిన చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలో జరుగుతున్న పొలంబడి కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం పక్క గ్రామమైన అనికేపల్లి – 2లో ఆర్బికెని సందర్శించి, వ్యవసాయ సహాయకుడు రికార్డులను తనిఖీ చేశారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మంజుల, కంటేపల్లి, అనికేపల్లి వ్యవసాయ సహాయకులు అభిషేక్, విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
కంటేపల్లిలో రైతు శిక్షణా కార్యక్రమం వెంకటాచలం, ఫిబ్రవరి 2 (పున్నమి విలేఖరి): మండలంలోని కంటేపల్లిలో మంగళవారం రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు హైమావతి, వ్యవసాయ అధికారి శిరీష, నెల్లూరు రూరల్ సహాయ వ్యవసాయ సంచాలకులు బాలాజీ నాయక్, డాట్ సెంటర్ సైంటిస్ట్ శ్వేత హాజరయ్యారు. వరిలో వచ్చే తెగుళ్లు, పురుగులు, వాటి నియంత్రణకు తీసుకోవలసిన చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలో జరుగుతున్న పొలంబడి కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం పక్క గ్రామమైన అనికేపల్లి – 2లో ఆర్బికెని సందర్శించి, వ్యవసాయ సహాయకుడు రికార్డులను తనిఖీ చేశారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మంజుల, కంటేపల్లి, అనికేపల్లి వ్యవసాయ సహాయకులు అభిషేక్, విష్ణువర్ధన్ పాల్గొన్నారు.

