*ఔరుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం*
ఫ్యూచర్ సీటీ కమిషనరేట్ – పరిధిలో
తేదీ: 27 మార్చి 2026.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
మాడ్గుల్ మండలం ఔరుపల్లి గ్రామం సమీపంలోని ఎండిపోయిన కాలువలో సుమారు 50 ఏళ్ల వ్యక్తి మృతదేహం గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో, కొన్ని రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
స్థానికుల సమాచారం మేరకు మాడ్గుల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్హెచ్ఓ వేణుగోపాల్ తెలిపారు.




