Sunday, 7 December 2025
  • Home  
  • ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర్రక్రియ‌ను స‌మ‌ర్ధంగా నిర్వ‌హించాలి*
- విశాఖపట్నం

ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర్రక్రియ‌ను స‌మ‌ర్ధంగా నిర్వ‌హించాలి*

*ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర్రక్రియ‌ను స‌మ‌ర్ధంగా నిర్వ‌హించాలి* *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:-* *అధికారుల‌ను ఆదేశించిన రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి వివేక్ యాద‌వ్ *జిల్లాలో చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను వివ‌రించిన క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ విశాఖ‌ప‌ట్ట‌ణం, డిసెంబ‌ర్ 06 ః ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడటానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్దేశించిన విధానాల ప్ర‌కారం జిల్లాలో ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను స‌మ‌ర్ధంగా నిర్వ‌హించాల‌ని జిల్లా అధికారుల‌ను రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి వివేక్ యాద‌వ్ ఆదేశించారు. ముంద‌స్తు ఎస్.ఐ.ఆర్. నేప‌థ్యంలో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఒత్తిడికి గురికాకుండా ప్ర‌ణాళికాయుతంగా విధులు నిర్వ‌ర్తించాల‌ని చెప్పారు. శ‌నివారం జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, ఈఆర్వోలు, ఏఆర్వోలతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. వివిధ అంశాల‌పై సూక్ష్మంగా స‌మీక్షించిన ఆయ‌న ఓట‌ర్ల జాబితా విధానంలో భాగంగా నిర్వ‌హించే మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను ప‌క్కాగా చేప‌ట్టాల‌ని సూచించారు. ఓటరు జాబితాలో వారి పేర్లు, తండ్రి/తల్లి పేర్లను ధృవీకరించడానికి 2002 సంవత్సరం ఓటరు జాబితాను పరిశీల‌న‌లోకి తీసుకోవాల‌న్నారు. 2002 జాబితాను 2025 నాటి జాబితాతో స‌రిపోల్చి వివరాల‌ను న‌మోదు చేసుకోవాల‌ని, ఆయా పోలింగ్ స్టేష‌న్, నియోజ‌క‌వ‌ర్గం వారీగా ఓట‌ర్ల వివ‌రాల‌ను మ్యాపింగ్ చేయాల‌ని సూచించారు. స్వీయ పత్రాల స్వీక‌ర‌ణ‌, మ్యాపింగ్ ప్ర‌క్రియ పార‌ద‌ర్శ‌క రీతిలో జ‌రిగేలా అధికారులు, సిబ్బంది చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులూ త‌లెత్త‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉంటూ ప్ర‌క్రియ‌ను స‌జావుగా చేప‌ట్టాల‌న్నారు. *జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 24.54 శాతం మ్యాపింగ్ జ‌రిగింది ః జిల్లా క‌లెక్ట‌ర్* ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు జిల్లాలో చేప‌ట్టిన ప్ర‌క్రియ‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 24.54 శాతం మ్యాపింగ్ జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ సీఈవోకు వివ‌రించారు. ఏడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో 20,20,726 మంది ఓట‌ర్లు ఉండ‌గా, 2,81415 మంది వివ‌రాల‌ను మ్యాపింగ్ చేశామ‌ని, మిగిలిన ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని పేర్కొన్నారు. వార‌సులు, ఇత‌ర సంతానం తాలూక వివ‌రాల‌ను కూడా జాగ్ర‌త్త‌గా అనుసంధానం చేస్తున్నామ‌ని చెప్పారు. అయితే జిల్లాలో దాదాపు అన్నీ పట్ట‌ణీక‌ర‌ణ ప్రాంతాలే కావ‌టం, వ‌ల‌స కార్మికుల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల వివ‌రాల సేక‌ర‌ణ‌లో క్షేత్ర‌స్థాయిలో కొంచెం క్లిష్ట‌త ఏర్ప‌డుతోంద‌ని ఈఆర్వోలు సీఈవో దృష్టికి తీసుకొచ్చారు. ఈఆర్వోలు సంగీత్ మాధుర్, ద‌యానిధి, సుధాసాగ‌ర్, మ‌ధుసూధ‌న్, సునీత‌, శేష‌శైల‌జ‌, జ్ఞాన‌వేణి, ప‌లువురు ఏఈఆర్వోలు స‌మావేశంలో పాల్గొన్నారు.

*ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర్రక్రియ‌ను స‌మ‌ర్ధంగా నిర్వ‌హించాలి*
*విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:-*
*అధికారుల‌ను ఆదేశించిన రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి వివేక్ యాద‌వ్
*జిల్లాలో చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను వివ‌రించిన క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్

విశాఖ‌ప‌ట్ట‌ణం, డిసెంబ‌ర్ 06 ః ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడటానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్దేశించిన విధానాల ప్ర‌కారం జిల్లాలో ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను స‌మ‌ర్ధంగా నిర్వ‌హించాల‌ని జిల్లా అధికారుల‌ను రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి వివేక్ యాద‌వ్ ఆదేశించారు. ముంద‌స్తు ఎస్.ఐ.ఆర్. నేప‌థ్యంలో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఒత్తిడికి గురికాకుండా ప్ర‌ణాళికాయుతంగా విధులు నిర్వ‌ర్తించాల‌ని చెప్పారు. శ‌నివారం జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, ఈఆర్వోలు, ఏఆర్వోలతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. వివిధ అంశాల‌పై సూక్ష్మంగా స‌మీక్షించిన ఆయ‌న ఓట‌ర్ల జాబితా విధానంలో భాగంగా నిర్వ‌హించే మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను ప‌క్కాగా చేప‌ట్టాల‌ని సూచించారు. ఓటరు జాబితాలో వారి పేర్లు, తండ్రి/తల్లి పేర్లను ధృవీకరించడానికి 2002 సంవత్సరం ఓటరు జాబితాను పరిశీల‌న‌లోకి తీసుకోవాల‌న్నారు. 2002 జాబితాను 2025 నాటి జాబితాతో స‌రిపోల్చి వివరాల‌ను న‌మోదు చేసుకోవాల‌ని, ఆయా పోలింగ్ స్టేష‌న్, నియోజ‌క‌వ‌ర్గం వారీగా ఓట‌ర్ల వివ‌రాల‌ను మ్యాపింగ్ చేయాల‌ని సూచించారు. స్వీయ పత్రాల స్వీక‌ర‌ణ‌, మ్యాపింగ్ ప్ర‌క్రియ పార‌ద‌ర్శ‌క రీతిలో జ‌రిగేలా అధికారులు, సిబ్బంది చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులూ త‌లెత్త‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉంటూ ప్ర‌క్రియ‌ను స‌జావుగా చేప‌ట్టాల‌న్నారు.

*జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 24.54 శాతం మ్యాపింగ్ జ‌రిగింది ః జిల్లా క‌లెక్ట‌ర్*

ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు జిల్లాలో చేప‌ట్టిన ప్ర‌క్రియ‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 24.54 శాతం మ్యాపింగ్ జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ సీఈవోకు వివ‌రించారు. ఏడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో 20,20,726 మంది ఓట‌ర్లు ఉండ‌గా, 2,81415 మంది వివ‌రాల‌ను మ్యాపింగ్ చేశామ‌ని, మిగిలిన ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని పేర్కొన్నారు. వార‌సులు, ఇత‌ర సంతానం తాలూక వివ‌రాల‌ను కూడా జాగ్ర‌త్త‌గా అనుసంధానం చేస్తున్నామ‌ని చెప్పారు. అయితే జిల్లాలో దాదాపు అన్నీ పట్ట‌ణీక‌ర‌ణ ప్రాంతాలే కావ‌టం, వ‌ల‌స కార్మికుల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల వివ‌రాల సేక‌ర‌ణ‌లో క్షేత్ర‌స్థాయిలో కొంచెం క్లిష్ట‌త ఏర్ప‌డుతోంద‌ని ఈఆర్వోలు సీఈవో దృష్టికి తీసుకొచ్చారు.

ఈఆర్వోలు సంగీత్ మాధుర్, ద‌యానిధి, సుధాసాగ‌ర్, మ‌ధుసూధ‌న్, సునీత‌, శేష‌శైల‌జ‌, జ్ఞాన‌వేణి, ప‌లువురు ఏఈఆర్వోలు స‌మావేశంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.