
విశాఖపట్నం సంగం శరత్ థియేటర్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా అభిమానులతో కలిసి వీక్షించారు. సినిమా అద్భుతంగా ఉందని, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా జనసేన శ్రేణులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

